Sheetla Mata Temple | భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది దుర్మరణం
Sheetla Mata Temple | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో శరన్నవరాత్రి వేళ ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ (Gwalior)లోని 400 ఏండ్లనాటి ప్రసిద్ధ శీత్లామాత ఆలయం (Sheetla Mata Temple) వద్ద అదుపుతప్పిన ఓ ట్రక్కు భక్తులపైకి దూసుకెళ్లింది.
Sheetla Mata Temple | త్రినేత్ర న్యూస్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో శరన్నవరాత్రి వేళ ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ (Gwalior)లోని 400 ఏండ్లనాటి ప్రసిద్ధ శీత్లామాత ఆలయం (Sheetla Mata Temple) వద్ద అదుపుతప్పిన ఓ ట్రక్కు భక్తులపైకి దూసుకెళ్లింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 39 మంది గాయపడ్డారు.
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శీత్లామాతను దర్శించుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. అయితే శనివారం రాత్రి 1.30 (ఆదివారం తెల్లవారుజామున) గంటల సమయంలో చినోర్ (Chhinor) వైపు నుంచి వరి ధాన్యం (Paddy) లోడుతో వస్తున్న ట్రక్కును ట్రక్కును పోలీస్ చెక్పోస్టు వద్ద ఉన్న సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపుతప్పిన లారీ పోలీస్ బారికేడ్లు, స్టాపర్లను ఛేదించుకుని ఆలయం వైపు దూసుకొచ్చింది. ఆలయ ప్రధాన ద్వారం, గోడను ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచిఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు ట్రక్కు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులకూ తీవ్రగాయాలయ్యాయి.

పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గ్వాలియర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మ్వీర్ సింగ్ (Dharmveer Singh) చెప్పారు. నవరాత్రుల సందర్భంగా ఆ మార్గంలో బారికేడ్లు, పోలీసు చెక్పోస్టు, స్టాపర్లు ఉన్నప్పటికీ ట్రక్కు ఎలా లోపలికి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
#WATCH | Madhya Pradesh | Early morning visuals from the spot where a truck ran over several people near Sheetla Mata Mandir in Gwalior, claiming the lives of 11 people and leaving 29 people injured https://t.co/zyoabIhQ8a
— ANI (@ANI) October 18, 2026
సంబంధిత వార్తలు

Bus Accident | కాల్వలో పడ్డ మినీ బస్సు.. ఎనిమిది మంది భక్తులు మృతి
అక్టోబర్ 17, 2026

CS Sanjay Jaju | ఎట్టిపరిస్థితుల్లో వరి వేయొద్దు.. రైతులకు చెప్పండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
అక్టోబర్ 12, 2026

Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Nalgonda Medical College | నల్లగొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. ఈ నెల 24 వరకు దరఖాస్తులు
- ●Stampede | దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు
- ●Dandiya Event | దాండియా వేడుకలో కూలిన లైటింగ్ సిస్టమ్.. విద్యార్థిని మృతి
- ●Horoscope | అక్టోబర్ 18 రాశిఫలాలు.. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం!
- ●US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

Nalgonda Medical College | నల్లగొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. ఈ నెల 24 వరకు దరఖాస్తులు

Stampede | దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు

Dandiya Event | దాండియా వేడుకలో కూలిన లైటింగ్ సిస్టమ్.. విద్యార్థిని మృతి

Horoscope | అక్టోబర్ 18 రాశిఫలాలు.. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం!



