త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam 2026 | హనుమంత వాహనంపై కోదండ‌రాముడిగా.. నేత్ర‌ప‌ర్వంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు.!

Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఆదివారం ఉదయం హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది. కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్పస్వామివారు రామభక్తుడైన హనుమంతుడిపై విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా.. భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ భక్తిపారవశ్యంతో సాగింది.

P

Devotional | Published On Sep 20, 2026, 3.28 pm IST

Brahmotsavam 2026 | హనుమంత వాహనంపై కోదండ‌రాముడిగా.. నేత్ర‌ప‌ర్వంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు.!
Advertisement

Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఆదివారం ఉదయం హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది. కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్పస్వామివారు రామభక్తుడైన హనుమంతుడిపై విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా.. భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ భక్తిపారవశ్యంతో సాగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ ‘గోవిందా.. గోవిందా..’ అంటూ స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరామావతారంలో తన పరమభక్తుడైన హనుమంతునిపై విహరించడం విశేషం. భగవంతుడిపై అచంచల భక్తి, సేవాభావం, శరణాగతికి హనుమంతుడు ప్రతిరూపంగా నిలుస్తాడు. శ్రీరాముడు, హనుమంతుల దివ్యసంబంధం భక్తి, జ్ఞానం, సేవాతత్వాల సమన్వయాన్ని చాటిచెబుతుంది. హనుమంత వాహనంపై కోదండరాముని దర్శించుకోవడం ద్వారా భక్తుల్లో భగవద్భక్తి, ధర్మనిష్ఠ, శరణాగతి భావాలు మరింత పెంపొందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి ఆదివారం వస్త్ర బహుమానం అందించారు. నెల్లూరు లోక్‌సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలు అందజేశారు.

Advertisement
Advertisement