త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Mohan | ఇరుముడి సెంటిమెంట్ కంటిన్యూ – ఓజీ హీరోయిన్‌తో మాస్ మ‌హారాజా రొమాన్స్‌

త‌న త‌దుప‌రి సినిమా కోసం ఇరుముడి సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయ‌బోతున్నారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. కోలీవుడ్ హీరోయిన్‌తో జోడీక‌ట్ట‌నున్నారు. ర‌వితేజ హీరోగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హార‌ర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో మాస్ మ‌హారాజాతో ఓజీ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహ‌న్ రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Sep 20, 2026, 2.08 pm IST

Priyanka Mohan | ఇరుముడి సెంటిమెంట్ కంటిన్యూ – ఓజీ హీరోయిన్‌తో మాస్ మ‌హారాజా రొమాన్స్‌
Advertisement

Priyanka Mohan |  ఇరుముడితో మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి ముందు ర‌వితేజ న‌టించిన ఆరు సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఈ ప‌రాజ‌యాల‌తో మాస్ మ‌హారాజా ప‌నైపోయిందంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ట్రోల్స్‌కు ఇరుముడి విజ‌యంతో బ‌దులిచ్చాడు. శివ‌నిర్వాణ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ కెరీర్‌లోనే కాకుండా ఈ ఏడాది టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

నాలుగు సినిమాలు...

ఇరుముడి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో హీరోగా మ‌ళ్లీ బిజీ అయ్యారు ర‌వితేజ‌.నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. బ్రోచేవారెవ‌రురా, స‌రిపోదా శ‌నివారం సినిమాల ఫేమ్ వివేక్ ఆత్రేయ‌తో ఓ హార‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ద‌స‌రాకుఈ సినిమా అఫీషియ‌ల్‌గా లాంఛ్ కానున్న‌ట్లు స‌మాచారం.

ఓజీ బ్యూటీ...

ర‌వితేజ కెరీర్‌లో ఫ‌స్ట్ హార‌ర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ఓజీ బ్యూటీ ప్రియాంక‌ అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇరుముడిలో కోలీవుడ్ బ్యూటీ ప్రియా భ‌వానీ శంక‌ర్ క‌థానాయిక‌గా క‌నిపించింది. త‌మిళ హీరోయిన్ సెంటిమెంట్ బాగా క‌లిసివ‌చ్చింది. దాంతో వివేక్ ఆత్రేయ సినిమాలోనూ ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్సైన‌ట్లు స‌మాచారం. అందుకే ప్రియాంక మోహ‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వివేక్ ఆత్రేయ గ‌త సినిమా స‌రిపోదా శ‌నివారంలో కూడా ప్రియాంకనే హీరోయిన్‌గా క‌నిపించింది.

న‌వంబ‌ర్‌లో....

తొలి సినిమా నుంచి ప్రియాంక అరుళ్ మోహ‌న్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటోంది. ర‌వితేజ సినిమాలోనూ ఈ బ్యూటీ ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టి వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ

నాని గ్యాంగ్‌లీడ‌ర్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా మోహ‌న్‌. ఆ త‌ర్వాత శ్రీకారం, స‌రిపోదా శ‌నివారంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం త‌మిళంలో మూడు, క‌న్న‌డంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది.

 

Advertisement
Advertisement