త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | నాలుగేళ్ల క్రితం షూటింగ్ పూర్తి – డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – “ఏ” స‌ర్టిఫికెట్‌తో రిలీజ్‌

మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్త‌యిన నాలుగేళ్ల త‌ర్వాత రిలీజ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అక్టోబ‌ర్ 2 నుంచి జీ5 ఓటీటీలో ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. పూజా మేరీ జాన్‌లో మృణాల్ ఠాకూర్‌తో పాటు హ్యుమా ఖురేషి మ‌రో హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Sep 20, 2026, 3.42 pm IST

Mrunal Thakur | నాలుగేళ్ల క్రితం షూటింగ్ పూర్తి – డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – “ఏ” స‌ర్టిఫికెట్‌తో రిలీజ్‌
Advertisement

Mrunal Thakur |  మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్త‌యిన నాలుగేళ్ల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. పూజా మేరీ జాన్‌లో మృణాల్ ఠాకూర్‌తో పాటు టాక్సిక్ ఫేమ్ హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా న‌టించ‌గా...విజ‌య్‌ రాజ్‌, విక్రామ్ సింగ్ చౌహాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ బాలీవుడ్ మూవీకి న‌వ్‌జోత్ గులాటీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా...

పూజా మేరీ జాన్ షూటింగ్ 2022లో పూర్త‌య్యింది. సెన్సార్ స‌మ‌స్య‌ల‌తో పాటు నిర్మాణ‌ప‌ర‌మైన ఇబ్బందుల కార‌ణంగా రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు అడ్డంకుల‌ను దాటుకొని ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నేరుగా ఓటీటీలో విడుద‌ల అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి.

న‌మ్మేది నిజ‌మేనా...

అక్టోబ‌ర్ 2న జీ5 ఓటీటీలో విడుద‌ల అవుతోంది. హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సినిమా రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తూ జీ5 ఓటీటీ ఓ పోస్ట్ పెట్టింది. కొన్ని కథలు మనం చూసేది నిజమేనా అనే అనుమానం రేకెత్తిస్తాయి. మ‌రికొన్ని మనం నమ్మేది నిజమేనా అని అనుకునేలా చేస్తాయి. ఈ కథ ఆ రెండింటి మధ్య ఉన్న ప్రతి ఒక్క విషయాన్నీ ప్రశ్నించేలా ఉంటుంది అని ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ది.

ప్రియుడు హ‌త్య‌కు గురైతే...

ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీలో పూజ అనే పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ క‌నిపించ‌బోతుంది. పూజ ప్రాణంగా ప్రేమించిన అనికేత్ అనుమాన‌స్ప‌ద రీతిలో చ‌నిపోతాడు. ఆ హ‌త్య నేరం పూజ‌పై ప‌డుతుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఓ అప‌రిచితుడి నుంచి వేధింపులు ఎదుర‌వుతుంటాయి. ఈ స‌మ‌స్య‌ల నుంచి త‌న స్నేహితురాలైన లాయ‌ర్ స‌నా సాయంతో పూజ ఎలా బ‌య‌ట‌ప‌డింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. రెండు గంట‌ల ర‌న్‌టైమ్‌తో పూజా మేరీ జాన్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది.

 

Advertisement
Advertisement