Ratha Saptami | తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు..
Ratha Saptami | సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో (Tirumala) రథసప్తమి (Ratha Saptami) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీమలయప్ప స్వామివారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహించనున్నారు.
Devotional | Published On Jan 25, 2026, 9.29 am IST
త్రినేత్ర.న్యూస్: సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో (Tirumala) రథసప్తమి (Ratha Saptami) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీమలయప్ప స్వామివారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన మలయప్ప స్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. వేడుకలను కనులారా వీక్షించి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ వేడుకల నేపథ్యంలో ఆలయ మహద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు వివిధ రకాల పువ్వులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడవాహన సేవ, మధ్యాహ్నం హనుమంత వాహనం, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం రాత్రి శ్రీవారికి చంద్రవాహన సేవతో వేడుకలు ముగియనున్నారు. సూర్యకిరణాలు తాకిన వెంటనే పూర్తిస్థాయిలో వాహనసేవలు ప్రారంభమవుతాయి. రథసప్తమి వేడుకల నేపథ్యంలో తిరుమల ఆలయంలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, స్లాటెడ్ సర్వదర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

అరసవెళ్లిలో ఘనంగా..
సూర్య భగవానుడు కొలువై ఉన్న అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఓ వైపు సూర్యజయంతి.. మరోవైపు ఆదివారం కావడంతో ఆదినారాయణుడి నిజరూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి 9 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిరీక్షించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు దేవస్థానంలో ఆరంభమైన మహాక్షీరాభిషేక సేవ కన్నులపండువగాగా సాగింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






