Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Venus Transit | ప్రేమ, ఆకర్షణ, సౌందర్యం, సుఖసంతోషాలు, సంపదకు ప్రతీకగా జ్యోతిష్యంలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాల రాశి సంచారంతో పాటు నక్షత్ర మార్పులకు కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 11న) శుక్రుడు రాశిని మార్చుకోనున్నాడు. స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు.
Venus Transit | ప్రేమ, ఆకర్షణ, సౌందర్యం, సుఖసంతోషాలు, సంపదకు ప్రతీకగా జ్యోతిష్యంలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాల రాశి సంచారంతో పాటు నక్షత్ర మార్పులకు కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 11న) శుక్రుడు రాశిని మార్చుకోనున్నాడు. స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. రాహువు అధిపత్యంలోని ఈ నక్షత్రంలో శుక్రుడు అక్టోబర్ 24 వరకు సంచరించనున్నాడు. శుక్రుడి ఈ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులుంటాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సింహం, వృశ్చికం, మీనం రాశుల వారు ఈ సమయంలో కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు. ఈ రాశులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో, పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం రండి..!
సింహరాశి
స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం సింహ రాశి వారికి ముఖ్యంగా ప్రేమ, దాంపత్య సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త అవసరమని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. చిన్నచిన్న అపార్థాలు కూడా సంబంధాల్లో ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉండటంతో మాటతీరు, స్పందించే విధానంలో సంయమనం పాటించడం మంచిది. భాగస్వామి అభిప్రాయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో తమ మాటే నెగ్గించుకోవాలనే ధోరణి కంటే ఎదుటివారి భావాలను ఓపికగా వినడం ఈ సమయంలో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పూర్తిగా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం, హై రిస్క్ ఉన్న ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం విషయంలో అప్రమత్తత అవసరం.
పరిహారం: శుభ ఫలితాల కోసం శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడు ప్రస్తుతం ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానం త్రిక స్థానాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఈ నేపథ్యంలో రాహువు అధిపత్యంలోని స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం ప్రేమ, దాంపత్య జీవితంలో కొంత గందరగోళానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామితో అనవసరమైన వాదనలకు పోకుండా ఉండటం ముఖ్యం. చిన్న విభేదాలను పెద్దవిగా మార్చకుండా సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తమ బంధానికి సంబంధించిన విషయాల్లో బయటి వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవడం, వారినే అతిగా నమ్మడం ఏమాత్రం మంచిదికాదు. ఇతరులు చెప్పిన మాటల ఆధారంగా భాగస్వామిపై అనుమానాలు పెంచుకోవడం బంధంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా ఖర్చులు, లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
పరిహారం: శుక్రుడి అనుగ్రహం కోసం ‘ఓం శుం శుక్రాయ నమః’ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం శుభప్రదం.
మీన రాశి
మీన రాశి వారికి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం నేపథ్యంలో ప్రేమ, వివాహ బంధాల్లో అనవసరమైన అయోమయం ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామి గురించి ఇతరులు చెప్పే మాటలను వెంటనే నమ్మి నిర్ణయానికి రావడం సమస్యలను పెంచే ఛాన్స్ ఉంది. ఏదైనా విషయం తెలిసినప్పుడు ముందుగా వాస్తవాలను తెలుసుకుని, ఆ తర్వాతే స్పందించడం మంచిది. భావోద్వేగానికి లోనై తీసుకునే నిర్ణయాల కంటే పరస్పర అవగాహనతో వ్యవహరించడం సంబంధాలకు మేలు చేస్తుంది. ఆర్థిక విషయాల్లోనూ పొదుపు పాటించాల్సిన సమయం. విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల బడ్జెట్ దెబ్బతినే అవకాశం ఉండటంతో అవసరం, అనవసర ఖర్చులను గుర్తించి వ్యవహరించాలి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తే తొందరపడకుండా నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లడం మంచిది. ఆరోగ్యం విషయంలోనూ నిర్లక్ష్యం చేయకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి.
పరిహారం: బియ్యం, పాలు, చక్కెర వంటి తెల్లని వస్తువులను అవసరం ఉన్న వారికి దానం చేయడం శుభపద్రం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ
- ●Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!
- ●Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
- ●NHRC | కాంగ్రెస్ సర్కార్‌పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
- ●Telangana DGP | ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు.. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు
- ●Varun Tej | కొడుకుతో మెగా హీరో - ఫొటోలు వైరల్

BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ

Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!

Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు

NHRC | కాంగ్రెస్ సర్కార్‌పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు





