Hartalika Teej | ఒకే రోజు హర్తాళికా తీజ్ తీజ్–వినాయక చవితి.. ఈ నాలుగురాశుల వారికి అన్నీ శుభాలే..!
Hartalika Teej | హర్తాళికా తీజ్, వినాయక చవితి ఒకే సమయంలో రావడం ఆధ్యాత్మికంగా విశేషమైనదిగా భావిస్తారు. హర్తాళికా తీజ్ రోజున పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి సుఖసంతోషాలు, సౌభాగ్యం, దాంపత్య శ్రేయస్సు కోరుకుంటారు. వినాయక చవితి రోజున విఘ్నాలను తొలగించే గణపతిని పూజిస్తారు. ఈ రెండు పర్వదినాల ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కలిసొచ్చే అవకాశముందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Hartalika Teej | హర్తాళికా తీజ్, వినాయక చవితి ఒకే సమయంలో రావడం ఆధ్యాత్మికంగా విశేషమైనదిగా భావిస్తారు. హర్తాళికా తీజ్ రోజున పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి సుఖసంతోషాలు, సౌభాగ్యం, దాంపత్య శ్రేయస్సు కోరుకుంటారు. వినాయక చవితి రోజున విఘ్నాలను తొలగించే గణపతిని పూజిస్తారు. ఈ రెండు పర్వదినాల ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కలిసొచ్చే అవకాశముందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితంలో చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కదలికలిక వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఆర్థికంగా ఊరట వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉండనుంది.
మేష రాశి
హర్తాళికా తీజ్, వినాయక చవితి పర్వదినాల ప్రభావంతో మేష రాశి వారికి ఈ సమయం ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తుంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పని ముందుకు కదిలే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడి, అవి భవిష్యత్తులో మంచి అవకాశాలుగా మారవచ్చు. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం విషయంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. చాలాకాలంగా ఆలోచిస్తున్న ప్రాజెక్టు లేదా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పూర్తిగా ఆలోచించిన తర్వాతే అడుగు వేయడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ పర్వదినాల సమయం కెరీర్ పరంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి పదవి లేదా బాధ్యతల్లో మార్పు రావచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు మొదట కాస్త ఒత్తిడిగా అనిపించినప్పటికీ.. అవే భవిష్యత్తులో మీ ఎదుగుదలకు బాటలు వేస్తాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, భాగస్వాములు పరిచయం అవుతారు. ఈ పరిచయాలు వ్యాపార విస్తరణకు ఉపయోగపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వారి ప్రోత్సాహంతో మీరు అనుకున్న లక్ష్యాల దిశగా మరింత ధైర్యంగా అడుగులు వేస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. చాలాకాలంగా వేధిస్తున్న డబ్బు సంబంధిత సమస్యలు క్రమంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని సక్రమంగా నిర్వహించుకోవడంలో విజయం సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి రావచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక ప్రణాళికల విషయంలో మాత్రం తొందరపాటు వద్దు. నిపుణుల సలహా తీసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం నెలకొంటుంది. సన్నిహితులతో ఉన్న చిన్నచిన్న అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడతాయి. మీ కృషికి సరైన వ్యూహం తోడైతే రానున్న రోజుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం శ్రమకు తగిన ఫలితాలను అందించే దశగా ఉంటుంది. మీరు ఎంతోకాలంగా చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా హోదా పెరిగే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీకు అందవచ్చు. మీరు సాధించాలనుకున్న లక్ష్యానికి చేరువ అవుతారు. వ్యాపారులకు విస్తరణకు సంబంధించిన కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రణాళికలు రూపొందించుకుని వాటిని అమలు చేయడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. ఆదాయంలో స్థిరత్వం పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి.
Read Also :
Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!
Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సంబంధిత వార్తలు

Horoscope | సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు!
సెప్టెంబర్ 12, 2026

Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!
సెప్టెంబర్ 12, 2026

Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Analog Paneer | పనీర్ లవర్స్‌కు బిగ్ షాక్.. రాష్ట్రంలో ఏడాదిపాటు నిషేధం.!
- ●Horoscope | సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు!
- ●Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!
- ●Uterus | ఆ యువకుడికి వృషణాలు లేవు.. పరీక్షలో బయటపడ్డ గర్భాశయం
- ●Teenmar Mallanna | స్కిల్ యూనివర్సిటీ వీసీకి పీహెచ్డీ పట్టా కూడా లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ●CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Analog Paneer | పనీర్ లవర్స్‌కు బిగ్ షాక్.. రాష్ట్రంలో ఏడాదిపాటు నిషేధం.!

Horoscope | సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు!

Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!

Uterus | ఆ యువకుడికి వృషణాలు లేవు.. పరీక్షలో బయటపడ్డ గర్భాశయం



