Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!
Budhaditya Raja Yogam | వేద జ్యోతిష్యంలో గ్రహాల సంచారం, గ్రహాల కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే యోగాలు ఆయా రాశులపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Budhaditya Raja Yogam | వేద జ్యోతిష్యంలో గ్రహాల సంచారం, గ్రహాల కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే యోగాలు ఆయా రాశులపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో ఈ నెలలో సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. కన్యా రాశిలో ఏర్పడే ఈ యోగం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు.
పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 17న ఉదయం 7:53 గంటలకు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే బుధుడు కన్యా రాశిలో ఉండడంతో సూర్యుడు, బుధుడి కలయిక జరుగుతుంది. దీంతో కన్యా రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం సెప్టెంబర్ 26 వరకు కొనసాగుతుంది. ఆ రోజున బుధుడు కన్యా రాశిని వీడి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కన్యలో సూర్యుడు, బుధుడి కలయిక ముగుస్తుంది. జ్యోతిష్య ప్రకారం బుధాదిత్య యోగం ప్రభావంతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంభాషణ నైపుణ్యం, తార్కిక ఆలోచన, వ్యాపార చతురత వంటి అంశాల్లో శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి ఈ యోగం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండొచ్చని చెబుతున్నారు.
కన్యా రాశి
బుధాదిత్య రాజయోగం కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ కష్టానికి, పనితీరుకు గుర్తింపు లభించొచ్చు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడొచ్చు. వ్యాపారులకు కొత్త పరిచయాలు, వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ కాలంలో ఉద్యోగ ప్రదేశంలో ఆత్మవిశ్వాసం, ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల మద్దతు లభించడంతో కీలకమైన బాధ్యతలు దక్కవచ్చు. ఉద్యోగంలో పదవి, బాధ్యతలకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యూహాలను రూపొందించుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉండొచ్చు. వ్యాపారాన్ని విస్తరించడం, ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధాదిత్య యోగం కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలను తీసుకురావచ్చని పండితులు పేర్కొంటున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారి మార్గదర్శకత్వంతో ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కష్టపడి చేసిన పనికి తగిన ఫలితాలు లభించొచ్చని చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితిలోనూ మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందడం, నిలిచిపోయిన డబ్బులు చేతికందే అవకాశం ఉంది. అలాగే, అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి బుధాదిత్య యోగం ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన అవకాశాలున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలు కూడా ఏర్పడొచ్చు. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు లభించే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, వ్యాపార పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. ఆచరణాత్మక ఆలోచన, సరైన వ్యూహంతో వ్యవహరిస్తే ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!
సెప్టెంబర్ 11, 2026

Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
సెప్టెంబర్ 11, 2026

BRICS Summit | పుతిన్, జిన్‌పింగ్ కార్లు ఎందుకంత స్పెషల్..? మిస్సైల్స్ దాడులను తట్టుకుంటాయా..?
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Uterus | ఆ యువకుడికి వృషణాలు లేవు.. పరీక్షలో బయటపడ్డ గర్భాశయం
- ●Teenmar Mallanna | స్కిల్ యూనివర్సిటీ వీసీకి పీహెచ్డీ పట్టా కూడా లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ●CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- ●HYDRAA Portal | అందుబాటులోకి 'హైడ్రా' అధికారిక పోర్టల్.. చెరువుల సమాచారం తెలుసుకోండిలా..
- ●CM Revanth Reddy | జెన్ ఆల్ఫా, జెన్ బీటా గురించి ఆలోచిస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Traffic restrictions | హైదరాబాద్‌లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Uterus | ఆ యువకుడికి వృషణాలు లేవు.. పరీక్షలో బయటపడ్డ గర్భాశయం

Teenmar Mallanna | స్కిల్ యూనివర్సిటీ వీసీకి పీహెచ్డీ పట్టా కూడా లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

HYDRAA Portal | అందుబాటులోకి 'హైడ్రా' అధికారిక పోర్టల్.. చెరువుల సమాచారం తెలుసుకోండిలా..



