Devi Navaratri | దేవీ నవరాత్రులు చేయలేకపోతున్నారా..? ఈ మూడు రోజులు చేస్తే చాలు..!
Devi Navaratri | దేవీ నవరాత్రులు( Devi Navaratri ) ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో భక్తులందరూ ఉపవాస దీక్షలు చేపట్టి దుర్గామాత( Durga Mata )ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నవరాత్రుల్లోనే దుర్గాష్టమి( Durga Ashtami ), నవమి( Navami ) రోజున కన్యా పూజతో సహా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయ దశమి( Vijaya Dashami ) రోజున నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
Devotional | Published On Oct 11, 2026, 3.14 pm IST
Devi Navaratri | దేవీ నవరాత్రులు( Devi Navaratri ) ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో భక్తులందరూ ఉపవాస దీక్షలు చేపట్టి దుర్గామాత( Durga Mata )ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నవరాత్రుల్లోనే దుర్గాష్టమి( Durga Ashtami ), నవమి( Navami ) రోజున కన్యా పూజతో సహా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయ దశమి( Vijaya Dashami ) రోజున నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఆ మరుసటి రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని, తమను అనుగ్రహిస్తుందని చాలా మంది నమ్ముతారు.
అయితే చాలా మంది దేవీ నవరాత్రులను ఎంతో నిష్టతో పాటిస్తారు. ఉపవాస దీక్షలను చేపట్టి తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటారు. నవరాత్రి దీక్షలు చేపట్టలేని వారు ఈ మూడు రోజులు అమ్మవారి పూజలను ఆచరిస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్మకం. మరి ఆ మూడు రోజులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
మహిమాన్వితమైన శరన్నవరాత్రుల సందర్భంగా కొన్ని విధులు చెప్పబడుతున్నాయి. గురువులు కలవారు వారి సంప్రదాయాలను అనుసరించి అర్ధనాదులు చేసుకొనగలరు. ఇందులో సాధారణంగా అందరూ ఆచరించగలిగేవి ఇవ్వబడ్డాయి.
యాచాశ్వయుజమాసే స్యాత్ ప్రతిపత్ భద్రయాన్వితా శుద్ధార్చనం తస్యాం శతయజ్ఞఫలప్రదం (దేవీపురాణం)
- ఆశ్వయుజమాసంలో భద్రయోగంతో కూడిన శుద్ధపాడ్యమి నాడు అమ్మవారి పూజ నూరు యజ్ఞములు చేసిన ఫలితాన్ని కలుగజేస్తుంది.
అశ్వినేమాసి శుక్లేతు కర్తవ్యం నవరాత్రకం ప్రతిపదాది క్రమేణైవ యావచ్చ నవమీ భవేత్ త్రిరాత్రం వాపి కర్తవ్యమ్ సప్తమ్యాది యథాక్రమం
అశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి నవరాత్రులు ఆచరించలేని వారు సప్తమితో మొదలుపెట్టి మూడు రోజులైనా అమ్మవారి పూజలను ఆచరించాలి. దీనిని త్రిరాత్రవ్రతం అంటారు.
యస్త్వేకస్యామథాష్టమ్యాం నవమ్యాం అథ సాధకః పూజయేత్ వరదాం దేవీం మహావిభవవిస్తరైః (కాలికాపురాణం)
శ్రద్ధతో అష్టమినాడు లేదా నవమినాడైనా వైభవంగా వరాలనిచ్చే వరదయైన అమ్మవారిని పూజిచాలి.
మహానవమ్యాం పూజేయం సర్వకామప్రదాయికా
సర్వేషు చైవ వర్ణేషు తవ భక్త్యా ప్రకీర్తితా
కృత్వాం పోృతి యశో రాజ్యపుత్రాయురరసంపదః
ఏవమన్యైరపి తథా దేవ్యాః కార్యం ప్రపూజనం
విభూతిమతులాం లబ్ధుం చతుర్వర్గప్రదాయకమ్ (దేవీ-కాలికా పురాణములు)
మహానవమి నాడు చేసే దేవీపూజ అన్ని కోరికలను తీరుస్తుంది. అన్ని జాతులవారు ఆచరించాలి. దానివల్ల కీర్తి, అధికారం, సంతానం, ఆయువు, సంపదలు పొందుతారు. ధర్మ-అర్థ-కామ-మోక్షాలనే నాలుగు పురుషార్ధములనూ పొందడానికి తప్పనిసరిగా అందరూ ఈనాడు దేవీపూజను ఆచరించాలి.
ఏవం చ వింధ్యవాసిన్యాం నవరాత్రోపవాసతః
ఏకభుక్తేన సక్తేన తథైవాయాచితేన చ
పూజనీయా జనైర్దేవీ స్థానే స్థానే పురే పురే
గృహే గృహే శక్తిపరైః గ్రామే గ్రామే వనే వనే (హేమాద్రి తిలకం)
అమ్మవారిని శరన్నవరాత్రులలో ఉపవాసం లేదా ఒకపూట ఆహారం తీసుకొని లేదా నక్షవ్రతముతో లేదా అడుగకుండా వచ్చినది తీసుకుంటూ ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో, అన్ని ప్రదేశాలలోనూ పూజించాలి.
కన్యాసంస్థే రవౌశుక్రశుక్లామారభ్య నందికాం
అయాచీ హ్యధనైకాశీ నక్తాశీవాథవాంబదః
భూమౌ శయీత చామంత్ర్య కుమారీః భోజయేన్ముడా
వస్త్రాలంకారదానైశ్చ సంతోష్యాః ప్రతివాసరం (మదనరత్నం)
ఆహారనియమాలను పాటిస్తూ, భూశయనం చేస్తూ కుమారీలను కూడా ప్రతిరోజు వస్త్ర అలంకరణాలను సమర్పించి, భోజనం పెట్టి సంతోషపరచాలి.
ఏక వర్షాతు యా కన్యా పూజార్డే తాం విసర్జయేత్
గంధపుష్పఫలాదీనాం ప్రీతిస్తస్యా న విద్యతే
తేన ద్వివర్షామారభ్య దశవర్ష పర్యంతా ఏవ పూజ్యాన్ త్వన్యాః
తాసాం చ క్రమేణ కుమారికా, త్రిమూర్తిః, కల్యాణీ, రోహిణీ, కాలీ, చండికా, శాంభవీ, దుర్గా, సుభద్రా ఇతి నామభిః పూజా కార్యా,
ఒక ఏడాది వయసు గల కన్యకు గంధం, పువ్వులు, పండ్లు వాటిపై ప్రీతి ఉండదు కాబట్టి; రెండవ సంవత్సరం నుండి పదవ సంవత్సరం ఉన్న కన్యల వరకు పూజించాలి. వారిని క్రమంగా కుమారిక, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర అనే పేర్లతో పూజించాలి.
అశ్వినే మాసి మేఘాంతే మహిషాసురమర్దినీం
నిషాసు పూజయేద్భక్త్యా సోపవాసాదిక: క్రమాత్ -(దేవీపురాణం)
సంపూజ్య నవదుర్గాం చ నక్తం కుర్యాత్ సమాహితః,
నవరాత్రాభిదం కర్మ సక్తవ్రతమిదం స్మృతం -(స్కాందపురాణం)
నవరాత్రులలో మహిషాసురమర్దినిని లేదా నవదుర్గలను ఆహారాది నియమాలతో పూజించాలి. బ్రహ్మాండపురాణంలో చెప్పినట్లు లలితాదేవిని కూడా పూజించవచ్చు.
స్నానం మాంగలికం కృత్వా తతో దేవీం ప్రపూజయేత్
శుద్ధాభిర్మృత్తికాభిశ్చ పూర్వం కృత్వా తు వేదికం
యవాన్ వైవాపయేత్తత్ర గోధూమైశ్చాపి సంయుతాన్
తత్ర సంస్థాపయేత్ కుంభం విధినా మంత్రపూర్వకం. (రుద్రయామలం)
ఇదం కలశస్థాపనం రాత్రే న కార్యం (మత్స్యపురాణం)
మంగళస్నానం చేసి శుద్ధమైన మట్టితో వేదికను ఏర్పరచి, యవలను, గోధుమలను చల్లి, గురువు చెప్పిన విధితో అక్కడ కలశను స్థాపించాలి. కలశ స్థాపన రాత్రిసమయంలో చెయ్యరాదు.
కలశ ఆవాహన చెయ్యడానికి శ్లోకం
ఆగచ్ఛ వరదే దేవి దైత్యదర్పనిషూదిని
పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే
సర్వతీర్థమయం వారి సర్వదేవసమన్వితం
ఇమం ఘటం సమాగచ్ఛ తిష్ఠ దేవగణైః సహ
దుర్గే దేవి సమాగచ్ఛ సాన్నిధ్యమిహ కల్పయ
ఏవం చతుర్వేదవిదో విప్రాన్ సర్వాన్ ప్రసాదయేత్
తేషాం చ వరణం కార్యం వేదపారాయణాయ వై (రుద్రయామలం)
అమ్మవారి ప్రీతిగా వేదపండితులచే అవకాశమున్నంత వరకు వేదపారాయణ గావించాలి.
ఆధారే స్థాపయిత్వాతు పుస్తకం పూజయేత్ సుధీః,
హస్తసంస్థాపనాదేవ యస్మాద్వై విఫలం భవేత్.
నవరాత్రులలో ఏదైనా గ్రంథాన్ని పారాయణ చెయ్య దలచు కుంటే, ఆ గ్రంథానికి ఆధారంగా వ్యాసపీఠం లేదా మరేదైనా అధారాన్ని కల్పించి పారాయణ చెయ్యాలి కానీ, కేవలం చేతులతో పట్టుకుని పారాయణ చేస్తే అది నిష్ఫల మవుతుంది.
మూలఋక్షే సురాధీశ పూజనీయా సరస్వతీ
నాధ్యాపయేన్న చ లిఖేత్ నాధీయీత కదాచన
పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో ద్విజోత్తమ
నవరాత్రులలో మూలానక్షత్రం నాడు సరస్వతిని పూజించాలి. ఈ పూజలు చేసే రోజులలో చదువు చెప్పరాదు, ఏమీ వ్రాయకూడదు, చదవకూడదు. విద్య రావాలి అనుకునే వారు పుస్తకములను స్థాపించి పుస్తకరూపిణి సరస్వతిని పూజించడం ఆరంభించాక అది పూర్తయ్యే వరకు ఈ నియమాలు పాటించాలి.
నవరాత్రులు లేదా మూడు రాత్రులు లేదా నవమి నాడు పూజించిన తరువాత దశమి నాడు ఉదయం విధివిధానంగా పూజించి ఈ విధంగా ప్రార్థించాలని దేవీపురాణ వచనం
రూపం దేహి యశో దేహి భగం భగవతి దేహి మే
పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ్చ దేహి మే
మహిషఘ్ని మహామాయే చాముండే ముండమాలిని
ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేవి నమోస్తు తే.
పిదప ఉద్వాసన చేసేటప్పుడు
ఉత్తిష్ఠ దేవి చందేశి శుభాం పూజాం ప్రగృహ్య చ,
కురుష్వ మమ కల్యాణం అష్టాభిః శక్తిభిః సహ.
గచ్ఛ గచ్ఛ పరం స్థానం స్వస్థానం దేవి చండికే.
దుర్గే దేవి జగన్మాతః స్వస్థానం గచ్చ పూజితా
సంవత్సరే వ్యతీతేతు పునరాగమనాయ వై.
ఇమాం పూజాం మయా దేవి యథాశక్త్యాపపాదితాం
రక్షార్థం త్వం సమాదాయ ప్రజ స్థానమనుత్తమం అని ప్రార్థించాలి.
సంబంధిత వార్తలు

Navaratri Utsavams | తిరుచానూరులో రేపటి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
అక్టోబర్ 10, 2026

Special Trains | సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ మార్గంలో 34 ప్రత్యేకరైళ్లు
అక్టోబర్ 10, 2026

Singareni | సింగరేణి కార్మికులకు దసరా కానుక.. 15న పండుగ అడ్వాన్స్ జమ
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Green India Challenge-Maharashtra | ఊరూరికో జమ్మి చెట్టు.. మహారాష్ట్రలోనూ శ్రీకారం
- ●Vaishnavi Chaitanya | టాలీవుడ్‌కు బ్రేక్ - కోలీవుడ్‌పై కన్నేసిన బేబీ హీరోయిన్ - రొమాంటిక్ జానర్లో డెబ్యూ మూవీ
- ●Sharannavaratri | ఇంద్రకీలాద్రికి శరన్నవరాత్రి శోభ.. తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
- ●Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
- ●Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ - క్రైమ్ కామెడీగా 'తులాభారం'
- ●Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు

Green India Challenge-Maharashtra | ఊరూరికో జమ్మి చెట్టు.. మహారాష్ట్రలోనూ శ్రీకారం

Vaishnavi Chaitanya | టాలీవుడ్‌కు బ్రేక్ - కోలీవుడ్‌పై కన్నేసిన బేబీ హీరోయిన్ - రొమాంటిక్ జానర్లో డెబ్యూ మూవీ

Sharannavaratri | ఇంద్రకీలాద్రికి శరన్నవరాత్రి శోభ.. తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి



