CM Revanth Reddy | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు
CM Revanth Reddy | విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ( Dasara Festival ) ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ( Dasara Festival ) ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు.
“తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానమున్న దసరా పండుగ... ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను మనకు గుర్తుచేస్తుంది. ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి సంకేతంగా ప్రతి పల్లెలో పండుగ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. తెలంగాణ పల్లెపల్లెల్లో దసరా వేడుకలకు మరింత ప్రత్యేకతను చేకూర్చే జమ్మిపూజ, జమ్మి ఆకులను (బంగారం) ఆత్మీయులకు అందించుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం మన సంస్కృతిలోని గొప్పదనానికి ప్రతీకలు అని సీఎం పేర్కొన్నారు.
ప్రకృతిని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, బంధాలను బలోపేతం చేసుకోవడం, పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం వంటి విలువలను ఈ సంప్రదాయాలు చాటిచెబుతాయని” ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయదశమి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, సకల విజయాలు కలగాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
- ●CP Sajjanar | ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
- ●Navratri Special | ఒక దీపం చెప్పిన కథ.. చీకటిని తొలగించే వెలుగు మనలోనూ ఉంది!
- ●Ravan Baba | 400 ఏళ్లుగా.. ఆ గ్రామానికి రావణుడే దేవుడు..!
- ●Navratri Special | అమ్మవారు ఎక్కడో లేరు.. నీలోనూ ఉన్నారు!
- ●Hyderabad Zoo | హైదరాబాద్ జూపార్కుకు కంగారూలు..!
- ●Gajakesari Raja Yoga | నవంబర్ 3న గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు ఆర్థికంగా అన్నీ లాభాలే..!








