Bindi | బొట్టు బిళ్లను అద్దానికి అతికిస్తున్నారా..? అయితే దంపతుల మధ్య వివాదాలే..!
Bindi | భారతీయ మహిళలు తప్పనిసరిగా బొట్టు( Bindi ) ధరిస్తారు. ఎందుకంటే బొట్టు అనేది మహిళలకు ఒక శక్తిని ఇవ్వడమే కాకుండా, ఆధ్యాత్మిక శక్తికి కూడా ప్రతీకగా అభివర్ణిస్తారు. అయితే కొందరు కుంకుమను, మరికొందరు బొట్టు బిళ్లలను వినియోగిస్తుంటారు.
Devotional | Published On Jul 2, 2026, 6.44 am IST
Bindi | భారతీయ మహిళలు తప్పనిసరిగా బొట్టు( Bindi ) ధరిస్తారు. ఎందుకంటే బొట్టు అనేది మహిళలకు ఒక శక్తిని ఇవ్వడమే కాకుండా, ఆధ్యాత్మిక శక్తికి కూడా ప్రతీకగా అభివర్ణిస్తారు. అయితే కొందరు కుంకుమను, మరికొందరు బొట్టు బిళ్లలను వినియోగిస్తుంటారు. ఈ బొట్టు బిళ్లలు వినియోగించేవారు స్నానం చేసే సమయంలో బాత్రూమ్‌లోని బకెట్‌కు లేదా గోడలకు, కొందరైతే తమ డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి అతికిస్తుంటారు. అయితే ఇలా బొట్టు బిళ్లలను అద్దానికి అతికించడం క్షణంలో అయిపోతుందేమో కానీ.. దీని ప్రభావం ఆలుమగల దాంపత్య జీవితంపై తీవ్రంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి బొట్టు బిళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి మహిళ కూడా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో.. అద్దం ముందు వాలిపోతారు. గంటల తరబడి రెడీ అవుతుంటారు. అయితే మన ప్రతిబింబాన్ని చూపించే పవిత్రమైన అద్దాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. అదేంటంటే.. అద్దంపై బొట్టుబిళ్లలు అతికించడమే. వాస్తు శాస్త్రంలో అద్దాలు శక్తిని ప్రతిబింబించే శక్తివంతమైన అంశంగా పరిగణిస్తారు. ఒక మహిళ అద్దంపై బొట్టు పెట్టుకున్నప్పుడు, అది ప్రతికూల శక్తిని ఆకర్షించగలదు. అద్దంపై చుక్క పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో ప్రతికూల ప్రకంపనలు ఏర్పడి, అది ఇంటి శ్రేయస్సు, సంతోషాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ఈ అలవాటు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుందట. భార్య భర్త మధ్య కూడా వివాదాలు, ఇంట్లో ఆర్థిక నష్టాలు, అనవసర ఖర్చులు, ఆర్థిక అస్థిరత పెరుగుతుందని జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఇక నుంచైనా అద్దానికి బొట్టు బిళ్లలు అతికించడం మానుకోండి సుమా..!
అద్దం పడకగదిలో లేదా ప్రధాన ద్వారం దగ్గర ఉంచితే, అది ఆర్థిక నష్టాన్ని ప్రోత్సహిస్తుంది. అద్దంపై చుక్కల గుర్తులు ఉంటే, వాటిని క్షుణ్ణంగా శుభ్రం చేయండి. ఈ గుర్తులను అలాగే వదిలేయడం ప్రతికూలతకు ఆహ్వానం పలికినట్టే. ఇక స్నానాల గదిని అపవిత్రమైన , అశుభ్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు కాబట్టి, స్నానాల గది గోడకు లేదా అద్దానికి బొట్టు అంటించడం సరికాదంటున్నారు. అద్దానికి అతికించిన బొట్టు తీసి పెట్టుకునే కన్నా కొత్తగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasara Holidays | అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. ముఖ్యమైన తేదీలివే..!
- ●HMWSSB | త్వరలోనే పెరగనున్న నీటి బిల్లులు..! ప్రజలపై అదనంగా రూ. 60 కోట్ల భారం..!!
- ●బీఆర్ఎస్కు కౌంటర్ సరే సీఎం సాబ్… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?
- ●Heat Wave | హైదరాబాద్‌లో మండుటెండలు.. 40 డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు
- ●Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ పనులకు మోక్షం..!
- ●Vastu Tips | ఈ నాలుగు మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. కోటీశ్వరులైపోతారట..!

Dasara Holidays | అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. ముఖ్యమైన తేదీలివే..!

HMWSSB | త్వరలోనే పెరగనున్న నీటి బిల్లులు..! ప్రజలపై అదనంగా రూ. 60 కోట్ల భారం..!!

బీఆర్ఎస్కు కౌంటర్ సరే సీఎం సాబ్… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?

Heat Wave | హైదరాబాద్‌లో మండుటెండలు.. 40 డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు






