KTR | అహంకార ధోరణిలో తెలంగాణ పోలీసులు : కేటీఆర్
KTR | హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళ పట్ల తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హోంగార్డు ఆనంద్ ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహంకార ధోరణిలో తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నాయని ధ్వజమెత్తారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళ పట్ల తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హోంగార్డు ఆనంద్ ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహంకార ధోరణిలో తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఓ సామాన్య మహిళను నడిరోడ్డుపై హోంగార్డు ఈడ్చుకెళ్తున్న వీడియోను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను.. ఈ రోజుల్లో తెలంగాణ పోలీసులు అంటే సామాన్య ప్రజలు గుర్తించే దళం కాదు. శిక్ష పడదనే ధోరణి, అహంకారం ఇప్పుడు వారి ట్రేడ్‌మార్క్‌గా మారాయని పేర్కొన్నారు.
పోక్సో కేసులో ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు నమోదైతే 9 రోజుల పాటు గాఢ నిద్రలో ఉంటారు. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద అమ్మాయిని.. ఓ ఎంపీ కుమారుడు కారుతో ఢీకొట్టి చంపిస్తే వారు మౌనంగా ఉంటారు. మాజీ సీఎంపై దాడి చేయడానికి వెళ్లే గూండాలకు ప్రత్యేక రోప్ పార్టీలతో ఎస్కార్ట్ ఇస్తారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడుతారు. వారి జుట్టు, చీరలు లాగుతారు. ఒక చిన్నారిని పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకుని ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తారు.. ఇది తెలంగాణ పోలీసుల తీరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కానీ సామాన్య ప్రజలు, రాజకీయ ప్రత్యర్థుల విషయానికి వస్తే మాత్రం.. వారు యూనిఫాంలో ఉన్న వీధి గుండాల కంటే తక్కువేమీ కాదు. ప్రతిరోజూ నడిరోడ్డుపై దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి, కానీ వారు మాత్రం రాజకీయ ఆటలు ఆడటంలో బిజీగా ఉంటారు. తెలంగాణ పోలీసు శాఖలోని ప్రియమైన నిజాయితీ గల సోదర సోదరీమణులారా, మీరు ఈ ఉద్యోగంలో చేరింది ఇందుకోసమేనా? అని కేటీఆర్ నిలదీశారు.
సంబంధిత వార్తలు

Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా
నవంబర్ 22, 2026

Deeksha Diwas | దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం
నవంబర్ 21, 2026

BRS Leaders | కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Serial Actress | సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోయిన్
- ●ICE Agents Seattle Airport | ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఆఫీసర్లు
- ●OM vs AOT | ఓం వర్సెస్ ఆకాశంలో ఒక తార - రెండు రోజుల్లో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే?
- ●Hyderabad Bomb Threat Email | కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను బాంబులతో పేల్చేస్తాం
- ●JEE Main 2027 | జేఈఈ మెయిన్-2027 వెల్లువెత్తిన దరఖాస్తులు
- ●Revanth Reddy Gandhi Bhavan Speech | కాంగ్రెస్ జెండా మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన బాధ్యత

Serial Actress | సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోయిన్

ICE Agents Seattle Airport | ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఆఫీసర్లు

OM vs AOT | ఓం వర్సెస్ ఆకాశంలో ఒక తార - రెండు రోజుల్లో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే?

Hyderabad Bomb Threat Email | కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను బాంబులతో పేల్చేస్తాం



