త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siya Goyal – Ketan Agarwal Case | సియా పెళ్లికి ఎందుకు ‘నో’ చెప్పలేకపోయింది? పుణె మర్డర్ కేసుపై చేతన్ భగత్ సంచలన విశ్లేషణ

పుణెలో సంచలనం సృష్టించిన సియా గోయల్ మర్డర్ కేసుపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ సంచలన విశ్లేషణ. భారతీయ తల్లిదండ్రుల మితిమీరిన నియంత్రణే ఈ దారుణానికి కారణమా?

J

Crime | Published On Jun 30, 2026, 5.28 pm IST

Siya Goyal – Ketan Agarwal Case | సియా పెళ్లికి ఎందుకు ‘నో’ చెప్పలేకపోయింది? పుణె మర్డర్ కేసుపై చేతన్ భగత్ సంచలన విశ్లేషణ

సంక్షిప్త సారాంశం

పుణెకి చెందిన 20 ఏళ్ల సియా గోయల్.. తన ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను లోహగడ్ ఫోర్ట్ (Lohagad Fort) పైనుంచి తోసేసిన కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇష్టం లేని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటే తల్లిదండ్రుల పరువు పోతుందనే భయంతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రముఖ రచయిత చేతన్ భగత్.. ముఖ్యంగా వ్యాపార కుటుంబాల్లో పిల్లల జీవితాలపై తల్లిదండ్రుల కంట్రోల్ ఎంత దారుణంగా ఉంటుందో తన ఆర్టికల్‌లో విశ్లేషించారు. తల్లిదండ్రుల డబ్బుపై ఆధారపడటం మానేసి.. తమ జీవితాలపై సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం నేటి జనరేషన్ (Gen Z) యువతకు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Siya Goyal - Ketan Agarwal Case | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని పుణెలో జూన్ 18న జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 20 ఏళ్ల సియా గోయల్‌కు.. కేతన్ అగర్వాల్ అనే యువకుడితో పెద్దలు అరేంజ్డ్ మ్యారేజ్ నిశ్చయించారు. అయితే అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో డేటింగ్ (Dating) లో ఉన్న సియా.. అతడితో కలిసి లోహగడ్ ఫోర్ట్ వద్దకు ట్రెక్కింగ్ కు వెళ్లి.. అక్కడి నుంచి కేతన్‌ను కిందకు తోసేసి హత్య చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో విచారణ సాగుతోంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా.. పోలీసులు చెబుతున్న ఒక విషయం మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. పెళ్లి వద్దని చెబితే తల్లిదండ్రుల పరువు పోతుందని భయపడిన సియా.. ఏకంగా కాబోయే భర్త ప్రాణం తీయడానికే మొగ్గుచూపిందని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో.. ఎదిగిన పిల్లల జీవితాలపై భారతీయ తల్లిదండ్రుల కంట్రోల్ ఎలా ఉందన్న అంశంపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ (Chetan Bhagat) ఒక పదునైన వ్యాసం రాశారు. ఆ ఆర్టికల్ సారాంశం ఆయన మాటల్లోనే..

తల్లిదండ్రుల కంట్రోల్.. ఒక స్టేటస్ సింబల్

మన దేశంలో పిల్లల జీవితాలపై తల్లిదండ్రుల కంట్రోల్ ఎప్పుడూ అంతం కాదు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసే ఫ్యామిలీస్‌లో ఇది మరీ ఎక్కువ. పిల్లలు ఏం తినాలో, ఎలా బతకాలో, ఎవర్ని పెళ్లి చేసుకోవాలో (కులం, మతం, కమ్యూనిటీ ఆధారంగా) అంతా వాళ్లే డిసైడ్ చేస్తారు. వాళ్ల దృష్టిలో 'మాట వినే పిల్లలు' (Obedient children) అనేది ఒక స్టేటస్ సింబల్. సియా కేసులో కూడా అదే జరిగింది. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం వాళ్లకు తెలియదు, అలాగే 19 ఏళ్లకే పెళ్లి ఇష్టం లేదని తెలిసినా పట్టించుకోలేదు.

స్టేటస్ కోసం కోట్లు ఖర్చు.. కానీ!

పది కోట్ల నుంచి ఐదొందల కోట్ల వరకు టర్నోవర్ ఉండే ఈ బిజినెస్ ఫ్యామిలీస్.. తమ వ్యాపారాల్లో పెద్దగా ఇన్నోవేషన్ (Innovation) గానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) గానీ చేయరు. కానీ సమాజంలో పరువు కోసం, స్టేటస్ కోసం డెస్టినేషన్ వెడ్డింగ్స్ (Destination weddings) పేరుతో వృథాగా కోట్లు ఖర్చు పెడతారు. పిల్లల వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సమాజంలో వాళ్ల ఇమేజ్‌కే వీళ్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చైనా లాంటి దేశాల్లో బిజినెస్ సెక్టార్ టెక్నాలజీ, రోబోటిక్స్ మీద పెట్టుబడులు పెడుతుంటే.. మనవాళ్లు మాత్రం పరువు కోసం ఉదయ్ పూర్ లో పది కోట్లు పెట్టి పెళ్లిళ్లు చేస్తుంటారు.

తప్పు పేరెంట్స్ దేనా? జెన్-జీ (Gen Z) ది లేదా?

అయితే, ఇక్కడ తప్పు అంతా తల్లిదండ్రులదేనా? ఈ జనరేషన్ పిల్లలది ఏమీ లేదా? అంటే కచ్చితంగా ఉంది. పాతకాలపు పద్ధతులను ఎదిరించే ధైర్యం నేటి యువతకు లేకపోవడమే అసలు సమస్య. మీకు ఇష్టం లేని పెళ్లి సంబంధం వచ్చినప్పుడు.. మీకు మరో వ్యక్తితో పరిచయం ఉన్నప్పుడు.. ఆ విషయాన్ని నిర్మొహమాటంగా పేరెంట్స్ కి చెప్పాలి. కానీ చాలామంది ఫైనాన్షియల్‌గా ఎదగకుండా, ప్రతీ దానికీ పేరెంట్స్ డబ్బు (Daddy's money) పై ఆధారపడుతున్నారు. "మై సపోర్ట్ సిస్టమ్" అనే ముసుగులో కంఫర్ట్ జోన్‌లో బతకడం అలవాటైపోయింది.

మీరు ఆర్థిక స్వాతంత్య్రం (Financial independence) సాధించనంత కాలం, భావోద్వేగపరమైన స్వేచ్ఛ మీకు దక్కదు. మీ బిల్లులు మీ పేరెంట్స్ కడుతున్నంత కాలం.. వాళ్లు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. కాబట్టి యువతా.. ముందుగా మీ కాళ్ల మీద మీరు నిలబడండి. మీకు ఇష్టం లేని విషయాలకు ధైర్యంగా 'నో' చెప్పండి. పాతకాలపు పద్ధతులను, మీ స్వేచ్ఛను హరించే ఈ 'గౌరవం' అనే ముసుగును పక్కనపెట్టి.. సొంతంగా ఎదగండి. అప్పుడే ఇలాంటి దారుణాలు ఆగుతాయి!

Advertisement
Advertisement