Tirupati | విద్యార్థినిని గర్భవతి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. వీడియో చూపించి మరో ప్రొఫెసర్ లైంగిక దాడి
Tirupati | ఉన్నత విద్య అభ్యసించేందుకు తిరుపతి (Tirupati)లోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (National Sanskrit University)కు వచ్చిన విద్యార్థినిని లోబర్చుకుని ఒక అధ్యాపకుడు (Assistant Professor) గర్భవతి చేయగా, మరో ప్రొఫెసర్ (Professor) ఏకాంత దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసి లైంగికంగా వేధించాడు
Tirupati | తిరుపతి (Tirupati)లోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (National Sanskrit University)లో దారుణం చేటు చేసుకుంది. విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) గర్భవతిని చేసిన విషయం దిగ్భ్రాంతి గొలుపుతోంది. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ లక్ష్మణ్ లైంగికంగా వేధించి, లోబర్చుకుని గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను మరో ప్రొఫెసర్ (Professor) ఫోన్‌లో చిత్రీకరించాడు. మరో ప్రొఫెసర్ ఆ దృశ్యాలను చూపించి, బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత విద్యార్థిని వర్సిటీ వీసీ (VC) కి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన వీసీ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీ నుంచి తన స్వగ్రామమైన ఒడిశా (Odisha) కు విద్యార్థిని వెళ్లిపోయింది. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ (Police Station) లో ఫిర్యాదు చేసేందుకు వర్సిటీ సిబ్బంది వెళ్లగా, బాధిత విద్యార్థినితో ఫిర్యాదు చేయించాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Boiler Blast | హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. నలుగురు దుర్మరణం
అక్టోబర్ 3, 2026

Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
అక్టోబర్ 3, 2026

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



