Nikitha Rao Godishala Murder Case | యూఎస్‌లో హైదరాబాద్ యువతిని హత్య చేసిన అర్జున్ అరెస్ట్
మరోవైపు నిఖిత మృతదేహాన్ని భారత్‌కి తరలించేందుకు యూఎస్‌లోని భారత ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిఖిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు నిఖితకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేశారు.
Nikitha Rao Godishala Murder Case | యూఎస్‌లోని మేరీలాండ్‌లో హైదరాబాద్‌కి చెందిన 27 ఏళ్ల యువతి నిఖిత రావు గొడిశలను చంపిన ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖితను తన ఇంట్లో చంపి ఆమె బాడీని ఇంట్లోనే వదిలేసి తను కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి మరీ ఇండియాకు తిరిగి వచ్చేశాడు అర్జున్. నిఖిత రావు హత్య గురించి తెలుసుకున్న పోలీసులు ఆ కేసుపై విచారణ ముమ్మరం చేశారు. అర్జున్ గురించి వివరాలు సేకరించే క్రమంలో అర్జునే.. నిఖితను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇంటర్‌పోల్ అధికారులు భారత పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి అర్జున్ గురించి వివరించగా, అతడు ఎక్కడున్నాడో ట్రేస్ చేసిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అర్జున్ తమిళనాడులో ఉన్నట్టు గుర్తించి వెంటనే తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంటర్‌పోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు నిఖిత మృతదేహాన్ని భారత్‌కి తరలించేందుకు యూఎస్‌లోని భారత ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిఖిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు నిఖితకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేశారు.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



