త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai | ట్ర‌యాంగిల్ ల‌వ్‌.. ప్రియుడి స్నేహితురాలిని కాల్చి చంపిన యువ‌తి

Mumbai | మ‌హారాష్ట్ర ముంబై (Mumbai)లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ‌తిని మ‌రో యువ‌తి గ‌న్‌తో కాల్చి చంపింది.

D

Crime | Published On Feb 13, 2026, 12.12 pm IST

Mumbai | ట్ర‌యాంగిల్ ల‌వ్‌.. ప్రియుడి స్నేహితురాలిని కాల్చి చంపిన యువ‌తి
Advertisement

Mumbai | మ‌హారాష్ట్ర ముంబై (Mumbai)లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ‌తిని మ‌రో యువ‌తి గ‌న్‌తో కాల్చి చంపింది. ముంబైలోని శివాజీనగర్ (Shivaji Nagar) ఫుర్కియానా మ‌సీదు వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు.

శివాజీ నగర్ కు చెందిన షిఫా షేక్ (19), మ‌రో యువ‌తి (25) ఇద్ద‌రూ ఒకే యువ‌కుడిని ప్రేమిస్తున్నారు. తొలుత యువ‌కుడు ఇద్ద‌రితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్న‌ట్లు యువ‌తుల‌కు తెలియదు. ఓ రోజు ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ క్ర‌మంలో యువ‌తులిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం షిఫా షేక్ కు ఆ యువతి ఫోన్ చేసింది. మాట్లాడాలని చెప్పి ఫుర్కియానా మసీదు (Furqania Masjid) వద్దకు ర‌మ్మ‌ని చెప్పింది. ఇద్ద‌రు యువ‌తులూ అక్క‌డికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ఈ క్ర‌మంలో స‌హ‌నం కోల్పోయిన యువ‌తి షిఫాను గ‌న్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చింది. దీంతో షిఫా అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది.

ప‌ట్ట‌ప‌గ‌లే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హ‌త్య జ‌రిగిన 12 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌ధాన నిందితురాలితో పాటూ మ‌రో యువ‌కుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

Advertisement
Advertisement