త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Cafe Gang Rape | ఢిల్లీ కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ ముసుగులో దారుణం.. యువతిపై కొలీగ్స్ సామూహిక అత్యాచారం

ఢిల్లీ ప్రీత్ విహార్ కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ విషాదంగా మారింది. తోటి ఉద్యోగులే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు అరెస్ట్ అయ్యారు.

J

Crime | Published On Nov 25, 2026, 7.26 am IST

Delhi Cafe Gang Rape | ఢిల్లీ కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ ముసుగులో దారుణం.. యువతిపై కొలీగ్స్ సామూహిక అత్యాచారం

సంక్షిప్త సారాంశం

తూర్పు ఢిల్లీ ప్రీత్ విహార్‌లోని 'సల్టనేట్ కేఫ్'లో సోమవారం అర్ధరాత్రి 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. కేఫ్ మూసివేసిన తర్వాత కూడా తాళం చెవి ఉండటంతో కొలీగ్స్ అంతా కలిసి తెల్లవారుజాము వరకు మద్యం పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో ఇద్దరు యువకులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడగా, మిగిలిన వారు వారికి సహకరించారు. మొత్తం ఆరుగురిపై బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Advertisement
  • ఢిల్లీ కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ
  • తోటి ఉద్యోగిపై సామూహిక అత్యాచారం
  • ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్

Delhi Cafe Gang Rape | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఉన్న ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై ఆమె తోటి ఉద్యోగులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధితురాలు, నిందితులు అందరూ ప్రీత్ విహార్‌లోని 'సల్టనేట్ కేఫ్' (Saltanate Cafe) లో కలిసి పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగిసిన తర్వాత, తోటి సిబ్బందితో కలిసి బాధితురాలు అక్కడే పార్టీకి హాజరైంది.

సాధారణంగా రాత్రి 11:30 గంటలకు కేఫ్ మూసివేస్తారు. అయితే, సిబ్బందిలో ఒకరి వద్ద కేఫ్ తాళం చెవి ఉండటంతో, షట్టర్లు మూసేసిన తర్వాత కూడా లోపలే మద్యం సేవిస్తూ, డ్యాన్స్ చేస్తూ పార్టీని కొనసాగించారు. మంగళవారం తెల్లవారుజాము 3:30 గంటల వరకు వీరంతా అక్కడే ఉన్నారు.

ఈ పార్టీ జరుగుతున్న సమయంలోనే తనపై ఇద్దరు పురుషులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, గ్రూప్‌లో ఉన్న మిగతా వారు కూడా ఈ దారుణానికి సహకరించారని ఆమె ఆరోపించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, ఇప్పటివరకు ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement