Ponnam Prabhakar | రేపట్నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ
Ponnam Prabhakar | హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హుస్నాబాద్‌లో అందజేయనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 16 నుంచి 27వ తేదీ వరకు నియోజకవర్గంలోని 7 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఒక మనిషి నడవడానికి మరొకరి సాయం కోసం ఎదురుచూడకూడదని, వినడానికి, చూడడానికి, తన పనులు తాను చేసుకోవడానికి ఎవరిపైనా ఆధారపడకుండా ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ఆశయమని మంత్రి పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క దివ్యాంగుడు, వృద్ధుడు కూడా సహాయం అందక ఇబ్బంది పడకూడదని, ఏ ఒక్క అర్హుడికీ ప్రభుత్వ సహాయం అందకుండా పోకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో చేపడుతున్న ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న ADIP పథకం కింద ALIMCO (Artificial Limbs Manufacturing Corporation of India) సంస్థ సహకారంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిర్వహించబడుతోంది.
ఈ శిబిరాల ద్వారా అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులకు మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, వాకింగ్ స్టిక్స్, కళ్లద్దాలు, నడక సహాయక పరికరాలు తదితర ఉపకరణాలను ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులైన దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | ఉనికిని చాటుకునేందుకే రాహుల్‌పై విమర్శలు.. బీజేపీ, కేటీఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం
నవంబర్ 13, 2026

Ponnam Prabhakar | గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం : మంత్రి పొన్నం ప్రభాకర్
నవంబర్ 12, 2026

RS Praveen Kumar | వియత్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?
నవంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ - మెగాస్టార్‌తో స్టెప్పులు
- ●FCI Hockey Tournament | రేపట్నుంచి ఎఫ్‌సీఐ అంతర్ జోనల్ హాకీ టోర్నమెంట్
- ●Dasoju Sravan | రేవంత్! పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ముందు నువ్ ఓడిపోయావ్
- ●Bandi Sanjay | రాహుల్ గాంధీ ఏ దేశానికి చెందిన వ్యక్తి..?
- ●IND Vs NZ | వన్డే సిరీస్ భారత్‌దే.. ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో గెలుపు
- ●CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ - మెగాస్టార్‌తో స్టెప్పులు

FCI Hockey Tournament | రేపట్నుంచి ఎఫ్‌సీఐ అంతర్ జోనల్ హాకీ టోర్నమెంట్

Dasoju Sravan | రేవంత్! పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ముందు నువ్ ఓడిపోయావ్

Bandi Sanjay | రాహుల్ గాంధీ ఏ దేశానికి చెందిన వ్యక్తి..?



