Tollywood | రద్దైన కరెన్సీ నోట్లతో కథతో మోసపోయాం జానకి – తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ
మోదీ ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్ల కథతో ఓ క్రైమ్ కామెడీ మూవీ రాబోతుంది. "మోసపోయాం జానకి" పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి సోహన్, విస్మయ శ్రీ, విష్ణు ఓయ్, నరేంద్ర రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
Tollywood | టాలీవుడ్‌లో ప్రస్తుతం తెలంగాణ (Telangana) బ్యాక్‌డ్రాప్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్లు లేకుండా తెలంగాణ యాస, సంస్కృతులు, కథలతకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కుతోన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ నేటివిటీతో మరో సినిమా రాబోతుంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు హీరోహీరోయిన్లు ఎవరన్నది ఆదివారం మేకర్స్ రివీల్ చేశారు.
మోసపోయాం జానకి...
క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు "మోసపోయాం జానకి" అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో సాయి సోహాన్, విస్మయశ్రీ, విష్ణు ఓయ్, నరేంద్ర రవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ముగ్గురు యువకులు డబ్బు సంచులతో పాతకాలం నాటి అంబాసిడర్ కారు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతూ ఇందులో కనిపిస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ముగ్గురు యువకులు పడిన కష్టాలను వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు. తెలంగాణ నేటివిటీతో ఈ సినిమా రాబోతుంది.
వచ్చే ఏడాది...
"మోసపోయాం జానకి" షూటింగ్ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మోసపోయాం జానకి సినిమాను నిశాంక్ రెడ్డి కుడితి, మహేందర్ రెడ్డి తిగుళ్ల నిర్మిస్తున్నారు. గతంలో పొట్టేల్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా – “కాంత” కోసం ఆడిషన్ ఇచ్చా కానీ – సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నవంబర్ 14, 2026

Ntr | ఊహించని కాంబో సెట్ – అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
నవంబర్ 14, 2026

Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత – హీరోగా తొలి ఛాన్స్ – విలన్‌గా ఫేమస్
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Vijay - Rashmika | జపాన్ వెకేషన్లో విరోష్ - రొమాంటిక్ ట్రిప్ ఫొటోలు వైరల్
- ●New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. 19న 4.63 లక్షల మంది ఖాతాల్లో జమ
- ●Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు
- ●Madhu Yashki Goud | అవగాహనుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు
- ●Ponnam Prabhakar | రేపట్నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ
- ●Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ - మెగాస్టార్‌తో స్టెప్పులు

Vijay - Rashmika | జపాన్ వెకేషన్లో విరోష్ - రొమాంటిక్ ట్రిప్ ఫొటోలు వైరల్

New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. 19న 4.63 లక్షల మంది ఖాతాల్లో జమ

Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు

Madhu Yashki Goud | అవగాహనుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు



