త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhu Yashki Goud | అవ‌గాహ‌నుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు

Madhu Yashki Goud | అవ‌గాహ‌నుంటే బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) ఆపొచ్చ‌ని.. ఇందుకు ముందు జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మ‌ని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki Goud) అన్నారు.

S

Telangana | Published On Nov 15, 2026, 4.21 pm IST

Madhu Yashki Goud | అవ‌గాహ‌నుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు
Advertisement
  • వ్యాయామం చేస్తూ ఆహార‌పు అల‌వాట్లు మార్చుకోండి
  • నెక్లెస్ రోడ్డు 5కే ర‌న్ ప్రారంభోత్స‌వంలో మధుయాష్కీ గౌడ్

Madhu Yashki Goud | త్రినేత్ర న్యూస్‌: అవ‌గాహ‌నుంటే బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke)ను ఆపొచ్చ‌ని.. ఇందుకు ముందు జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మ‌ని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki Goud) అన్నారు. యుక్త వ‌య‌సులోనే బ్రెయిన్ స్ట్రోక్ బారిన ప‌డ‌డం అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌న్నారు. "ఇండియన్ సొసైటీ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్" ఆధ్వర్యంలో సరళా దేవి ఫౌండేషన్, గౌతమ్ న్యూరో కేర్, యూజీ డ్రీమ్స్ సహకారంతో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన కోసం ఆదివారం హైదరాబాద్ (Hyderabad)లోని నెక్లెస్ రోడ్డులో నిర్వ‌హించిన‌ '5కే రన్ (5k Run) ను ఆయ‌న‌ ముఖ్యఅతిథిగా హాజరైన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడారు. ఎంతోమంది యుక్త వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లకు గురవుతున్నారు. అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనారోగ్యంతో ఆస్పత్రుల పాలై ఎంతోమంది అప్పుల పాలవుతున్నారు. ఒత్తిడిని నివారిస్తూ.. ముందస్తు జాగ్రత్తలు, వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్ల వల్ల వాటిని నివారించవచ్చు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మెలగాలి. తరచూ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి.

డాక్టర్ ఉదయ్ గౌతమ్ ప్రత్యేక చొరవ తీసుకొని బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని మ‌ధుయాష్కీ ప్ర‌శంసించారు. అనంత‌రం 5కే రన్ విజేతలకు బహుమతులు, మెడల్స్ ను మధుయాష్కీ చేతుల మీదుగా అందజేశారు.

Advertisement
Advertisement