Rama Nandana | ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూట్యూబర్ నందన అరెస్ట్
Rama Nandana | లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ తెలుగు యూట్యూబర్ రమా నందనను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆర్జీఐఏ పోలీసులు నందనను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
Rama Nandana | లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ తెలుగు యూట్యూబర్ రమా నందనను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆర్జీఐఏ పోలీసులు నందనను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నందనతో పాటు ఆమె భర్త జగర్లమూడి మధుకర్, ఆమె మామ మోహన్‌రావును నిందితులుగా పేర్కొన్నారు. లండన్‌లో ఉద్యోగం, యూకే వీసా పొడిగింపు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రూ.15 లక్షలు మోసపోయానని ఫిర్యాదు..
మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వీసా పొడిగింపు, ఉద్యోగం, సీవోఎస్ (CoS) కోసం పలు విడతల్లో మొత్తం రూ.15 లక్షలను డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. అయితే హామీ ఇచ్చిన సేవలను అందించలేదని.. తనకు అందజేసిన సీవోఎస్ డాక్యుమెంట్ సైతం నకిలీదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ రూ.2 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు జగర్లమూడి మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా, మోహన్‌రావును ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అనంతరం నందనపై లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.
ఆరోపణలను ఖండించిన నందన
తనపై వచ్చిన ఆరోపణలను రమా నందన గతంలోనే ఖండించారు. తాను గానీ, తన భర్త గానీ డెస్టినీ కన్సల్టెన్సీని నిర్వహించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తమ పేర్లను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ నందన, ఆమె భర్త హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో నందనను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sree Vishnu Movie | శ్రీవిష్ణు సరసన ‘సర్దార్ 2’ భామ.. సితార బ్యానర్లో మూవీ..!
సెప్టెంబర్ 7, 2026

Ramchandar Rao Arrest | బీజేపీ అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తత.. రాంచందర్‌రావు అరెస్ట్
సెప్టెంబర్ 7, 2026

Legislative Council | మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్ల బడ్జెట్ : మంత్రి అజారుద్దీన్
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | టీ షర్ట్స్పై రేవంత్ బడువే మాటలు లేవ్
- ●CM Revanth Reddy | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, తాతా మధును బర్తరఫ్ చేయాలి
- ●Aravalli Range | నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..? ఆరావళిపై హైపవర్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
- ●Indian Auto Market | పెట్రోల్‌ను దాటిన ప్రత్యామ్నాయ ఇంధనాలు.. ఆగస్టులో రికార్డు స్థాయికి ఆటో మార్కెట్..
- ●Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం: కొత్త పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి.. సీఎం అభ్యర్థిపై బిగ్ ట్విస్ట్!
- ●Sree Vishnu Movie | శ్రీవిష్ణు సరసన ‘సర్దార్ 2’ భామ.. సితార బ్యానర్లో మూవీ..!

Vemula Prashanth Reddy | టీ షర్ట్స్పై రేవంత్ బడువే మాటలు లేవ్

CM Revanth Reddy | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, తాతా మధును బర్తరఫ్ చేయాలి

Aravalli Range | నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..? ఆరావళిపై హైపవర్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్

Indian Auto Market | పెట్రోల్‌ను దాటిన ప్రత్యామ్నాయ ఇంధనాలు.. ఆగస్టులో రికార్డు స్థాయికి ఆటో మార్కెట్..



