త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Vivekananda | రేవంత్ ముక్కు నేలకు రాసినా క్షమించని నేరం చేసిండు

MLA Vivekananda | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను చిత్ర‌హింస‌లు పెట్టుమ‌ని సీఎం రేవంతే చెప్పాడ‌ని.. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారమే ఈరోజు దాడి జ‌రిగిందని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. దుర్మార్గుడు ఉన్న రాజ్యంలో దుర్మార్గాలే జ‌రుగుతాయ‌న్నారు.

S

Telangana | Published On Sep 7, 2026, 3.39 pm IST

MLA Vivekananda | రేవంత్ ముక్కు నేలకు రాసినా క్షమించని నేరం చేసిండు
Advertisement
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను చిత్ర‌హింస‌లు పెట్టుమ‌న్న‌డు
  • రేవంత్ ప్ర‌ణాళిక‌ను పోలీసులు అమ‌లు చేశారు
  • దుర్మార్గుడు రాజ్యంలో ఉంటే దుర్మార్గాలే జ‌రుగుత‌య్‌
  • బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద ఫైర్‌

MLA Vivekananda | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను చిత్ర‌హింస‌లు పెట్టుమ‌ని సీఎం రేవంతే చెప్పాడ‌ని.. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారమే ఈరోజు దాడి జ‌రిగిందని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. దుర్మార్గుడు ఉన్న రాజ్యంలో దుర్మార్గాలే జ‌రుగుతాయ‌న్నారు. ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర గ్రేహౌండ్స్ దళాలు ఎందుకని ప్ర‌శ్నించారు. ఉమ్మ‌డి ఏపీలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్న‌డూ చూడ‌లేద‌న్నారు. రేవంత్ ముక్కు నేల‌కు రాసినా క్ష‌మించని నేరం చేశార‌ని వ్యాఖ్యానించారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ఎమ్మెల్యేలతో చీఫ్‌ మార్షల్ మాట్లాడలే..

ముఖ్యమంత్రి ప్రణాళిక ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఈరోజు దాడి జరిగింది. ముఖ్యమంత్రి ప్రణాళికను పోలీసులు అమలు చేస్తున్నారు. వేలమంది పోలీసులు అసెంబ్లీ బయట ఉన్నారు. ఎమ్మెల్యేలతో చీఫ్‌ మార్షల్ మాట్లాడలేదు. దుర్మార్గమైన వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు. మా ఎమ్మెల్యేలకు గాయాలు అయ్యాయి. మహిళా శాసన సభ్యులపై పోలీసులు అనుచితంగా వ్యహరించారు.

ప్రజలు ఎన్నుకున్న‌ ప్రజా ప్రతినిధులం మేం. మాపై పోలీసులు ఇష్టానుసారంగా వ్యహరించారు. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసినా క్షమించని నేరం చేశాడు. రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట. రేవంత్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ భయపడదు. రేవంత్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్పడం ఖాయం. పాలన చెయ్యకుండా కేటీఆర్, హరీష్ రావుపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డిది సంకుచిత ఆలోచన అని వివేకానంద విమ‌ర్శించారు.

ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, విజయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement