Cloudscape Observer | మేఘాలను వీడియో తీస్తే రూ.8.5 లక్షల జీతం!
రోజు ఉదయాన్నే లేచి మంచు కొండలను, అందమైన మేఘాలను వీడియోలు తీసినందుకు ఓ యువకుడికి ఏకంగా రూ. 8.5 లక్షల జీతం దక్కింది. ఎవరైనా ఇది డ్రీమ్ జాబ్ అనాల్సిందే కదా! అసలు ఈ క్రేజీ ఆఫర్ ఎవరికి, ఎక్కడ వచ్చిందో తెలుసా?
సంక్షిప్త సారాంశం
చైనాలోని లాజున్ పర్వతంపై మేఘాలను కెమెరాలో బంధించినందుకు లీ సిచెన్ అనే 23 ఏళ్ల యువకుడికి ఏకంగా రూ. 8.5 లక్షలు (60,000 యువాన్లు) దక్కాయి. "క్లౌడ్ స్కేప్ అబ్జర్వర్" అనే ఈ డ్రీమ్ జాబ్ కోసం దాదాపు 3,500 మంది పోటీ పడగా, వృత్తిపరమైన ఫొటోగ్రాఫర్లను వెనక్కి నెట్టి లీ ఎంపికయ్యాడు. జూలై 16 నుంచి ఆగస్టు 15 వరకు కొండపై ఉచిత వసతితో పాటు రోజువారీ వీడియోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడమే ఇతని ప్రధాన డ్యూటీ. ఉదయం 5 గంటలకే నిద్రలేచి వాతావరణాన్ని రికార్డ్ చేయడం చూడటానికి ఈజీగా అనిపించినా, ప్రాక్టికల్‌గా ఇది చాలా టఫ్ టాస్క్ అని అతడు చెప్తున్నాడు.
- మేఘాలను చూస్తే లక్షల్లో జీతం
- నెలకు రూ.8.5 లక్షలు.. ఇదెక్కడి క్రేజీ జాబ్ బాస్
- పర్వతంపై ఆకాశం చూస్తూ లక్షల్లో సంపాదన
Cloudscape Observer | త్రినేత్ర.న్యూస్ : ఎవరైనా హాలిడే ట్రిప్ కోసం హిల్ స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ అందమైన సూర్యోదయాన్ని లేదా మేఘాలను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు. కానీ, ఆ హాబీనే ఒక ప్రొఫెషన్‌గా మార్చుకుని ఏకంగా నెలకు రూ. 8.5 లక్షలు సంపాదించాడు ఓ 23 ఏళ్ల Chinese Vlogger. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రసిద్ధ లాజున్ పర్వతం (Laojun Mountain) వద్ద జూలై 16 నుంచి ఆగస్టు 15 వరకు కేవలం మేఘాల కదలికలను రికార్డ్ చేసినందుకు లీ సిచెన్ (Li Sichen) అనే యువకుడికి అక్కడి పర్యాటక శాఖ మేనేజ్మెంట్ ఈ భారీ మొత్తాన్ని చెల్లించింది. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా, ప్రస్తుతం ఈ న్యూస్ ఇంటర్నెట్‌లో ఫుల్ Viral అవుతోంది.
3,500 మందిని వెనక్కి నెట్టి..
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ పర్యాటక ప్రాంతం వారు రీసెంట్‌గా "క్లౌడ్ స్కేప్ అబ్జర్వర్" (Cloudscape observer) అనే ఒక కొత్త పోస్ట్‌ను అనౌన్స్ చేశారు. నెల రోజుల పాటు ఉచిత వసతి కల్పిస్తూ 60,000 యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ. 8.5 లక్షలు) శాలరీ ఆఫర్ చేశారు. ఇంకేముంది, ఈ Dream Job కోసం వారం రోజుల్లోనే 3,500 మందికి పైగా అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంతో మంది ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు కూడా ఉన్నారు. కానీ వాటన్నింటినీ స్క్రూటినీ చేసి.. సోషల్ మీడియాలో కంటెంట్ క్వాలిటీ, లైక్స్, రీపోస్ట్‌ల ఆధారంగా చివరకు ఇ-కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న లీ సిచెన్‌ను 'నెంబర్ 001 అబ్జర్వర్'గా సెలెక్ట్ చేశారు.
పని ఈజీనే.. కానీ టెన్షన్!
చూడటానికి నెల రోజుల పాటు పెయిడ్ హాలిడే ట్రిప్‌లా అనిపించినా.. ప్రాక్టికల్‌గా ఈ పని చాలా కష్టమని లీ అంటున్నాడు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రకరకాల యాంగిల్స్‌లో మేఘాల ఫార్మేషన్స్‌ను తన కెమెరాతో పాటు డ్రోన్ల ద్వారా Shoot చేయాల్సి వచ్చేది. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా.. కొన్నిసార్లు వాతావరణం సహకరించక, ఆశించిన స్థాయిలో విజువల్స్ రాకపోయేసరికి తీవ్రమైన టెన్షన్ పడేవాడట. తన వీడియోలు నెటిజన్లకు కనెక్ట్ అవుతాయో లేదో అనే యాంగ్జయిటీ కూడా ఉండేది. ఏది ఏమైనా, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే డ్రోన్ ఆపరేటింగ్, కలర్ గ్రేడింగ్ లాంటి స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుని ఇంత భారీ ప్యాకేజీ కొట్టేయడం నిజంగా అదృష్టమే అని చెప్పాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Couple | ఒకే ఇంట్లో ఉంటున్నా.. 20 ఏళ్లుగా మాట్లాడుకోని భార్యాభర్తలు.. కారణం తెలిస్తే షాకే..!
జులై 24, 2026

Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
జులై 11, 2026

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
జులై 6, 2026
తాజావార్తలు
- ●KTR | నేను ఏ మాత్రం నిరాకరించలేని ఆహ్వానం ఇది : కేటీఆర్
- ●Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య
- ●CM Revanth Reddy | నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్
- ●Konda Surekha | వారి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి
- ●Hash Oil | హైదరాబాద్‌లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం

KTR | నేను ఏ మాత్రం నిరాకరించలేని ఆహ్వానం ఇది : కేటీఆర్

Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య

CM Revanth Reddy | నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి : సీఎం రేవంత్ రెడ్డి

Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్



