WPL 2026 | డబ్ల్యూపీఎల్ 2026.. గుజరాత్ బోణీ.. మరో మ్యాచ్‌లో ముంబై కూడా..
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జనవరి 10న డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా రెండు వరుస మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ క్రమంలోనే టోర్నీ 2వ మ్యాచ్‌లో గుజరాత్ బోణీ కొట్టగా, ఆ తరువాత నిర్వహించిన 3వ మ్యాచ్‌లో ముంబై శుభారంభం చేసింది.
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జనవరి 10న డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా రెండు వరుస మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ క్రమంలోనే టోర్నీ 2వ మ్యాచ్‌లో గుజరాత్ బోణీ కొట్టగా, ఆ తరువాత నిర్వహించిన 3వ మ్యాచ్‌లో ముంబై శుభారంభం చేసింది. 2వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ వుమెన్ టీమ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా గుజరాత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో గుజరాత్ జయాంట్స్ వుమెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గుజరాత్ ప్లేయర్లలో 65 పరుగులతో ఆష్‌లె గార్డెనర్ రాణించగా, 44 పరుగులతో అనుష్క శర్మ, 38 పరుగులతో సోఫీ డివైన్ ఆకట్టుకున్నారు. యూపీ ప్లేయర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, దియేంద్ర డాటిన్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ వుమెన్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు ప్లేయర్లలో ఫీబీ లిచ్‌ఫీల్డ్ 78 పరుగులతో మెరుపులాంటి ప్రదర్శన ఇచ్చింది. కానీ మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆమెకు సహకారం అందించలేదు. దీంతో యూపీ జట్టు ఓటమిపాలైంది. ఆ జట్టుపై గుజరాత్ జయాంట్స్ వుమెన్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, సోఫీ డివైన్, జార్జియా వేరమ్ తలా 2 వికెట్లు తీయగా, ఆష్‌లె గార్డెనర్, రాజేశ్వరి గైక్వాడ్‌లకు చెరొక వికెట్ దక్కింది.

కాగా అనంతరం అదే వేదికలో నిర్వహించిన 3వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్లు తలపడ్డాయి. ఈక్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై ఇండియన్స్ వుమెన్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై టీమ్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ముంబై ప్లేయర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 74 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచింది. మరో ప్లేయర్ నాట్ సివర్ బ్రంట్ కూడా 70 పరుగులతో హర్మన్‌కు చక్కని సహకారం అందించింది. దీంతో ముంబై జట్ట ఆరంభంలో వికెట్లను కోల్పోయినా చివరకు చక్కని స్కోరు చేయగలిగింది. ఇక ఢిల్లీ బౌలర్లలో నందని శర్మ 2 వికెట్లను పడగొట్టగా, షినెల్ హెన్రీ, శ్రీచరణి చెరొక వికెట్ తీశారు.
అనంతర బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్లలో షినెల్ హెన్రీ 56 పరుగులు చేయగా మిగిలిన ఎవరూ రాణించలేదు. వచ్చిన వారు వచ్చినట్లే ఔట్ అయి వెనుదిరిగారు. ఈ క్రమంలో ముంబై బౌలర్లలో నికోలా కేరీ, అమెలియా కెర్ చెరో 3 వికెట్లను పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. అలాగే నాట్ సివర్ బ్రంట్ 2 వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చింది. ఇక షబ్నం ఇస్మాయిల్, సంస్కృతి గుప్తాలకు చెరొక వికెట్ దక్కింది. ఈ క్రమంలో ఢిల్లీపై ముంబై 50 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
సంబంధిత వార్తలు

Vaibhav Sooryavanshi | చిచ్చర పిడుగు బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ వేతనం ఎంతంటే..?
ఏప్రిల్ 13, 2026

Yuzvendra Chahal | యజ్వేంద్ర చాహల్‌పై నెటిజన్ల ఆగ్రహం.. దుమారం రేపుతున్న వీడియో..
ఏప్రిల్ 12, 2026

IPL 2026 Ads | ఈసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు తగ్గిన ప్రకటనలు.. 3 శాతం మేర క్షీణత..
ఏప్రిల్ 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



