Lauren Bell | ఆర్‌సీబీ ఫ్యాన్సా మజాకా.. దెబ్బకు ఆశ్చర్యపోయిన లారెన్ బెల్..
Lauren Bell | ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను సాధించింది. అయితే ఆమె ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుకు ఆడుతున్న నేపథ్యంలో ఆమె తొలి మ్యాచ్‌ను ఆడిన అనంతరం ఒకేసారి భారీ ఎత్తున ఆమెకు ఫాలోవర్లు వచ్చి పడ్డారు.
Lauren Bell | ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను సాధించింది. అయితే ఆమె ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుకు ఆడుతున్న నేపథ్యంలో ఆమె తొలి మ్యాచ్‌ను ఆడిన అనంతరం ఒకేసారి భారీ ఎత్తున ఆమెకు ఫాలోవర్లు వచ్చి పడ్డారు. దీంతో ఆ ఫాలోవర్లు అందరూ ఆర్‌సీబీ ఫ్యాన్స్ అని అర్థమైంది. ఈ క్రమంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ క్రేజ్‌కు బెల్ ఫిదా అయింది. అంతమంది ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఉన్నారని తాను అనుకోలేదని, తాను సాధించిన ఈ ఫాలోవర్స్ మార్క్‌కు ఆమె థ్యాంక్స్ చెబుతూనే ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌కు ఆమె ఆశ్చర్యపోయింది. ఈ క్రమంలో ఆమె పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆర్‌సీబీ ఫ్యాన్స్ సత్తా తెలిసింది..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అంటే నిజానికి ఐపీఎల్‌లోనూ చాలా క్రేజ్ ఏర్పడింది. విరాట్ కోహ్లి ఆ జట్టులో ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ జట్టుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. తమ సొంత రాష్ట్రాలకు చెందిన టీమ్స్ ఐపీఎల్‌లో ఉన్నప్పటికీ ఆ టీమ్స్‌కు అతీతంగా చాలా మంది ఆర్‌సీబీని ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే గత సీజన్‌లో ఆర్‌సీబీ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే డబ్ల్యూపీఎల్‌లో అదే ఆర్‌సీబీ మహిళల జట్టులో ఆడుతున్న లారెన్ బెల్‌కు ప్రస్తుతం చాలా మంది ఫ్యాన్స్‌గా మారారు. ఈ క్రమంలోనే ఆమె 1 మిలియన్ మార్క్ ఫాలోవర్లను సాధించడంతో ఆమెకు ఆర్‌సీబీ ఫ్యాన్స్ గురించి అసలు విషయం అర్థమైంది. దీంతో ఆమె ఇన్‌స్టాలో అదే విషయాన్ని చెబుతూ పోస్ట్ పెట్టింది.

తొలి మ్యాచ్‌లోనే ఉత్తమ బౌలింగ్..
కాగా లారెన్ బెల్ ఈసారి డబ్ల్యూపీఎల్‌లో ముంబైతో ఆడిన తొలి మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. 4 ఓవర్లు వేసిన లారెన్ బెల్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసింది. ఆ ఓవర్లలో ఒక మెయిడెన్ ఓవర్ ఉండడం కూడా విశేషం. దీంతో ఆమె బౌలింగ్‌కు ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆమెను ఆస్ట్రేలియా మెన్స్ క్రికెట్ జట్టుకు చెందిన పేసర్ జోష్ హేజల్‌వుడ్‌తో పోలుస్తూ వారు సోషల్ మీడియలో పోస్టులు పెడుతున్నారు. జోష్ హేజల్‌వుడ్ కూడా ఆర్సీబీకి ఆడుతుండడం విశేషం. ఇక లారెన్ బెల్ ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో తొలిసారిగా ఆడుతోంది. గతంలో ఆమె యూపీ వారియర్జ్ టీమ్‌కు ఎంపికైంది. కానీ ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీకి దూరమైంది. ఈసారి ఆమెను ఆర్‌సీబీ యాజమాన్యం రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే బెల్ తన తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకోవడం విశేషం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sunil Gavaskar | ఐపీఎల్ ఫైనల్లో ఆడేది ఈ రెండు జట్లే.. సునీల్ గవాస్కర్ జోస్యం
మే 11, 2026

IPL 2026 Playoff Scenario | రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు.. ముందంజలో నాలుగు జట్లు.. చెన్నైకి సవాల్.. ముంబయి కథ ముగిసినట్లే..!
మే 3, 2026

Bengaluru Rain | బెంగళూరులో భారీ వర్షం.. వాన నీటిలో ఆడిన ఆర్‌సీబీ ప్లేయర్.. వీడియో
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



