త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sourav Ganguly | పాకిస్థాన్ వ్య‌వ‌హార శైలిపై గంగూలీ ఆస‌క్తిక‌ర కామెంట్స్.. ఇలా చేయ‌డం తొలిసారి అంటూ..

Sourav Ganguly | టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్ కోసం శ్రీలంకకు పంపేందుకు అనుమతిచ్చినా, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ మ్యాచ్‌లో మాత్రం మైదానంలోకి దిగబోమని స్పష్టం చేసింది.

S

Cricket | Published On Feb 8, 2026, 1.11 pm IST

Sourav Ganguly | పాకిస్థాన్ వ్య‌వ‌హార శైలిపై గంగూలీ ఆస‌క్తిక‌ర కామెంట్స్.. ఇలా చేయ‌డం తొలిసారి అంటూ..
Advertisement

Sourav Ganguly | టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్ కోసం శ్రీలంకకు పంపేందుకు అనుమతిచ్చినా, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ మ్యాచ్‌లో మాత్రం మైదానంలోకి దిగబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై తాజాగా స్పందించిన గంగూలీ.. వరల్డ్‌కప్‌లో భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ చెప్పడం ఇదే తొలిసారి. ఎందుకు ఆడబోమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.. అని అన్నారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టోర్నమెంట్‌లో అత్యంత లాభదాయకమైన పోరుగా పేరుంది. ఈ మ్యాచ్ జరగకపోతే భారీ ఆర్థిక నష్టం తప్పదని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని హెచ్చరించింది. మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

కాగా శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసి, మ్యాచ్ బహిష్కరణ వల్ల తాము ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను గుర్తు చేసింది. గతంలో కష్టకాలాల్లో పాకిస్థాన్ క్రికెట్‌కు శ్రీలంక అందించిన మద్దతును కూడా ఆ లేఖలో ప్రస్తావించింది. అయిన‌ప్ప‌టికీ పాక్ శ్రీ‌లంక విజ్ఞ‌ప్తిని తిర‌స్క‌రించింది. భార‌త్‌తో మ్యాచ్ ఆడే విష‌యంలో తాము త‌మ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తేల్చి చెప్పింది.

అయితే టీ20 వరల్డ్‌కప్ భారత్ వేదికగా జ‌రుగుతుండ‌డంతో ఆ విష‌యంపై కూడా గంగూలీ స్పందించారు. భారత జట్టుకు టైటిల్ ను నిలబెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇది హోమ్ వరల్డ్‌కప్. స్వదేశంలో భారత్ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి.. అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఏ జట్టూ వరుసగా రెండు టీ20 వరల్డ్‌కప్స్ గెలవలేదని, అలాగే స్వదేశంలో టైటిల్ సాధించిన ఉదాహరణ లేదని ఆయన గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో భార‌త్ ఆ అడ్డంకుల‌ను అధిగ‌మించి క‌ప్ సాధిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement