Rinku Singh | రింకు సింగ్ ఇంట్లో విషాద ఛాయలు.. క్యాన్సర్‌తో కన్నుమూసిన తండ్రి..
Rinku Singh | భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకు సింగ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ స్టేజ్ 4 లివర్ క్యాన్సర్‌తో ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్‌లో ఖాన్‌చంద్ సింగ్ తుది శ్వాస విడిచారు.
Rinku Singh | భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకు సింగ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ స్టేజ్ 4 లివర్ క్యాన్సర్‌తో ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్‌లో ఖాన్‌చంద్ సింగ్ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఖాన్‌చంద్ సింగ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఆయనను హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స విభాగంలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇప్పటికే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. రెనాల్ రీప్లేస్‌మెంట్ థెరపీ (సీఆర్టీ)ని కూడా నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. అయినప్పటికీ క్యాన్సర్ తీవ్రత మరీ అధికంగా ఉండడంతో వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. శుక్రవారం ఉదయం ఖాన్‌చంద్ సింగ్ కన్నుమూశారని వైద్యులు తెలిపారు.
రింకు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆడుతున్న రింకు సింగ్ సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ అనంతరం తన తండ్రికి సీరియస్ ఉండడంతో ఇంటికి వెళ్లాడు. ఆయన పరిస్థితిని సమీక్షించాక తిరిగి జట్టుతో రింకు చేరాడు. గురువారం చెన్నైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో రింకు ఆడలేదు. కానీ డ్రింక్స్ అందిస్తూ మైదానంలో కనిపించాడు. అయితే తండ్రి పరిస్థితి విషమించిందని తెలియడంతో అతను మళ్లీ గ్రేటర్ నోయిడాకు వెళ్లాడు. కాగా రింకు తండ్రి మరణవార్తపై బీసీసీఐ, తోటి ప్లేయర్లు, మాజీలు విచారం వ్యక్తం చేశారు. రింకు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఇది అత్యంత క్లిష్ట సమయమని, రింకు తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Pained to learn about the demise of Shri Khanchand Singh Ji, father of Rinku Singh. This must be an especially difficult time for Rinku and his family, even as he remains committed to his responsibilities during the T20 World Cup.
My heartfelt thoughts and prayers are with him…— Harbhajan Turbanator (@harbhajan_singh) February 27, 2026
కాగా ఖాన్‌చంద్ సింగ్ ఎల్‌పీజీ సిలిండర్ లను డెలివరీ చేస్తూ కుటుంబాన్ని పోషించారు. రింకు ప్రస్తుతం ఇంతటి స్థాయిలో ఉండేందుకు అతని తండ్రి కఠిన శ్రమే కారణమని చెప్పవచ్చు. ఆయన ఎంతో కష్టపడ్డారని, కుటుంబాన్ని పోషించడంతోపాటు రింకును ఈ స్థాయిలో చూసేందుకు తీవ్రంగా శ్రమించారని తోటి ప్లేయర్లు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

India vs England | ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
జులై 2, 2026

Iceland Cricket | అతనిలో అద్భుత ప్రతిభ.. ఇలాంటి కోచ్‌ను తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదు..
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్



