WPL 2026 | WPL విజేతగా ఆర్సీబీ.. జట్టుకు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో తెలుసా..?
WPL 2026 | ఐపీఎల్ టైటిల్ దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) పురుషుల జట్టుకు దాదాపు 18 ఏళ్లు పటిన విషయం తెలిసిందే. అయితే, ఆర్సీబీ మహిళా జట్టు మాత్రం 3 సంవత్సరాల్లో 2 సార్లు డబ్ల్యూపీఎల్ గెలుచుకుని సత్తా చాటింది.
WPL 2026 | ఐపీఎల్ టైటిల్ దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) పురుషుల జట్టుకు దాదాపు 18 ఏళ్లు పటిన విషయం తెలిసిందే. అయితే, ఆర్సీబీ మహిళా జట్టు మాత్రం 3 సంవత్సరాల్లో 2 సార్లు డబ్ల్యూపీఎల్ గెలుచుకుని సత్తా చాటింది. గురువారం వడోదర వేదికగా జరిగిన వరల్డ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 204 పరుగులు రికార్డ్ ఛేదనతో ఆర్సీబీ సగర్వంగా టైటిల్‌ను ముద్దాడింది. దీంతో జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు స్టార్ క్రికెటర్లు సైతం ఆర్బీఐపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ విజయంతో ఆర్బీబీకి భారీ ప్రైజ్ మనీ దక్కింది. ఇక మ్యాచ్‌లో రన్నర్‌గా నిలిచిన ఢిల్లీ జట్టుకు కూడా భారీగానే ప్రైజ్ మనీ వచ్చింది.
WPL 2026 ఎడిషన్కుగానూ బీసీసీఐ భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. మొత్తం రూ.10 కోట్ల ప్రైజ్ మనీని అందించింది. అందులో రూ.6 కోట్లు విన్నర్‌గా నిలిచిన ఆర్బీబీ జట్టుకు దక్కనుండగా.. మరో రూ.3కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు దక్కనుంది. మిగిలిన మనీని అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లతోపాటూ అత్యుత్తమ ప్రద్శన చేసిన ప్లేయర్లకు అందించనున్నారు.
ఏ ప్లేయర్‌కి ఎంత దక్కుతుందంటే..?
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - సోఫీ డివైన్ (గుజరాత్)- రూ.5 లక్షలు
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) - స్మృతి మంధాన (377 పరుగులు)- రూ.5 లక్షలు
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- సోఫీ డివైన్ (17 వికెట్లు)- రూ. 5 లక్షలు
అత్యధిక సిక్స్‌లు -హర్మన్‌ప్రీత్‌కౌర్, సోఫీ డివైన్ (13 సిక్స్‌లు) - రూ. 5 లక్షలు
బెస్ట్ స్ట్రైక్ రేట్ - సోఫీ డివైన్ - రూ. 5 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ - నందిని శర్మ (దిల్లీ క్యాపిటల్స్) - రూ. 5 లక్షలు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్) - స్మృతి మంధాన - రూ. 2.5 లక్షలు
సంబంధిత వార్తలు

Sunil Gavaskar | ఐపీఎల్ ఫైనల్లో ఆడేది ఈ రెండు జట్లే.. సునీల్ గవాస్కర్ జోస్యం
మే 11, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026

ICC Women’s T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన షెఫాలీ వర్మ..!
ఏప్రిల్ 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



