త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OnePlus | వ‌న్‌ప్ల‌స్ దీపావ‌ళి సేల్‌.. స్మృతి మంధానాతో ప్ర‌చారం..

OnePlus | మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా త‌న ఫెస్టివ్ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించ‌డంతోపాటు మేక్ ఇట్ స్పెష‌ల్ పేరుతో మూడో ఎడిష‌న్ ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగా ప‌లువురు సెల‌బ్రిటీల‌తో వ‌న్‌ప్ల‌స్ ప్ర‌చార చిత్రాలను నిర్మిస్తోంది. ఈ మేర‌కు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

S

Business | Published On Sep 30, 2026, 5.21 pm IST

OnePlus | వ‌న్‌ప్ల‌స్ దీపావ‌ళి సేల్‌.. స్మృతి మంధానాతో ప్ర‌చారం..
Advertisement

OnePlus | మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా త‌న ఫెస్టివ్ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించ‌డంతోపాటు మేక్ ఇట్ స్పెష‌ల్ పేరుతో మూడో ఎడిష‌న్ ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగా ప‌లువురు సెల‌బ్రిటీల‌తో వ‌న్‌ప్ల‌స్ ప్ర‌చార చిత్రాలను నిర్మిస్తోంది. ఈ మేర‌కు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ ప్ర‌చార చిత్రాల్లో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానా, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్లు విష్ణు కౌశల్‌, గోవింద్‌ కౌశల్‌, కొరియోగ్రాఫర్‌, ఇంటర్నెట్‌ పర్సనాలిటీ నికోల్‌ కాన్సెసావో న‌టించారు. ఈ ప్ర‌చార చిత్రాల షూటింగ్‌ను వ‌న్‌ప్ల‌స్ ప్రారంభించింది.

వ‌న్‌ప్ల‌స్ 16 రిలీజ్ నేప‌థ్యంలో ప్రాధాన్య‌త‌..

వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ 16ను రిలీజ్ చేయ‌నున్న నేప‌థ్యంలో ఈ నూత‌న ప్ర‌చార చిత్రాలు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఈసారి క్యాంపెయిన్‌ను ప్ర‌ధానంగా వివిధ తరాల మధ్య అనుబంధం, కలిసి పండుగను జరుపుకోవడం అనే అంశాలపై దృష్టి సారించి రూపొందిస్తున్నారు. వన్‌ప్లస్‌ కమ్యూనిటీ ఆధారిత విధానంలో భాగంగా రూపొందించిన ఈ క్యాంపెయిన్‌, ఆధునిక యువత జీవనశైలి, సంప్రదాయ కుటుంబ పద్ధతులు ఎలా కలిసిపోతున్నాయనే అంశాన్ని చూపిస్తుంది. వివిధ వయస్సుల వారు కలిసి పంచుకునే అనుభవాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. క్యాంపెయిన్‌ కథ ఓ వృద్ధ దంపతులతో ప్రారంభమవుతుంది. వారు ప్రశాంతంగా సాయంత్రాన్ని గడుపుతుండగా, వారి మనవళ్లు విష్ణు, గోవింద్‌ కౌశల్‌ పాత్రల్లో ఉత్సాహంగా వీడియో కాల్‌ చేస్తారు. ఆ తర్వాత స్మృతి మంధానా రావడంతో పరిస్థితి మారుతుంది. ఆమె వృద్ధ దంపతులను ఆధునిక దీపావళి వేడుకల్లో భాగం చేస్తుంది. నికోల్‌ కాన్సెసావో రూపొందించిన డ్యాన్స్‌ ఛాలెంజ్‌ను వన్‌ప్లస్‌ 15లో చిత్రీకరించడం, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 4 ద్వారా సంగీతాన్ని ప్రసారం చేయడం వంటి ఆధునిక అంశాలు ఇందులో కనిపిస్తాయి.

ప్ర‌త్యేక సేల్‌..

అయితే ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు సాధార‌ణ యూజ‌ర్ల‌కు కూడా వ‌న్‌ప్ల‌స్ అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇందుకు గాను అక్టోబ‌ర్ 10 త‌రువాతి నుంచి ప్ర‌త్యేక సైట్‌లో రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు వ‌న్‌ప్ల‌స్ తెలిపింది. ఇక దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో వ‌న్‌ప్ల‌స్ ప‌లు ఉత్ప‌త్తుల‌పై ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తోంది. ప‌లు ఫోన్లు, ఐవోటీ ఉత్ప‌త్తుల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. అయితే సేల్‌లో ఏయే ఉత్ప‌త్తుల‌పై ఎలాంటి ఆఫ‌ర్ల‌ను అందించ‌నున్నారు అనే విష‌యాల‌ను అక్టోబ‌ర్ 8న వెల్ల‌డిస్తామ‌ని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement