ICC Women’s ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..
ICC Women's ODI Rankings | భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో 790 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరోవైపు, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఎలీస్ పెర్రీ తిరిగి టాప్-10లో చోటు సంపాదించింది.
ICC Women's ODI Rankings | భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో 790 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరోవైపు, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఎలీస్ పెర్రీ తిరిగి టాప్-10లో చోటు సంపాదించింది. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో స్మృతి మంధానతో పాటు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రమే ఉన్నది. హర్మన్‌ప్రీత్ 652 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇటీవల హర్మన్‌ప్రీత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన మంధాన.. బ్యాటింగ్‌లోనూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ సత్తా చాటింది. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానానికి చేరింది. ఆస్ట్రేలియా బౌలర్లు అనాబెల్ సదర్లాండ్, మేగన్ షట్ ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి.
టీ20ల్లో టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లు
మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత క్రికెటర్లు సత్తా చాటారు. టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. షఫాలీ వర్మ 759 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. స్మృతి మంధాన 754 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ 656 పాయింట్లతో పదో స్థానాన్ని దక్కించుకుంది. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు ఆధిపత్యం కొనసాగుతోంది. శ్రీఛరణి 817 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. దీప్తి శర్మ 754 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో తొలి రెండు స్థానాలు భారత బౌలర్లకే లభించాయి. మహిళల టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఆమె నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఇక మహిళల వన్డే, టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Defamation Case | రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సిందే..!
అక్టోబర్ 13, 2026

ICC Player of the Month September 2026 | ఐసీసీ అవార్డుల్లో భారత స్టార్ల క్లీన్‌స్వీప్: రికార్డు స్థాయిలో 5వ సారి శుభ్‌మన్‌కు కిరీటం.. అదరగొట్టిన షఫాలీ వర్మ
అక్టోబర్ 13, 2026

Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Defamation Case | రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సిందే..!
- ●Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం
- ●AIADMK MLAs Resignation | ఆ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం సరైనదే.. స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●NPCI | దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు
- ●Ranabaali Censor Review | రణబాలి సెన్సార్ రివ్యూ - జీరో కట్స్ - రఫ్పాడించిన విజయ్ - యాక్షన్ ఫీస్ట్
- ●Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!

Defamation Case | రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సిందే..!

Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం

AIADMK MLAs Resignation | ఆ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం సరైనదే.. స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

NPCI | దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు



