త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhuvneshwar Kumar | ఆ ఘ‌న‌త సాధించిన రెండో బౌల‌ర్‌.. ఐపీఎల్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ న‌యా రికార్డ్‌

Bhuvneshwar Kumar | టీమ్ఇండియా మాజీ పేస్ బౌల‌ర్‌, ఆర్సీబీ స్పీడ్ స్ట‌ర్ భువ‌నేశ్వ‌ర్ (Bhuvneshwar Kumar) మ‌రో మైలురాయిని అందుకున్నారు. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా, మొద‌టి పేస్ బౌల‌ర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

G

Cricket | Published On Apr 6, 2026, 7.47 am IST

Bhuvneshwar Kumar | ఆ ఘ‌న‌త సాధించిన రెండో బౌల‌ర్‌.. ఐపీఎల్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ న‌యా రికార్డ్‌
Advertisement

Bhuvneshwar Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: టీమ్ఇండియా మాజీ పేస్ బౌల‌ర్‌, ఆర్సీబీ స్పీడ్ స్ట‌ర్ భువ‌నేశ్వ‌ర్ (Bhuvneshwar Kumar) మ‌రో మైలురాయిని అందుకున్నారు. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా, మొద‌టి పేస్ బౌల‌ర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆదివారం చిన్న‌స్వామి స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో త‌న తొలి ఓవ‌ర్‌ మొద‌టి బంతికే సీఎస్‌కే బ్యాట‌ర్ ఆయుష్ మాత్రేను ఔట్ చేశాడు. దీంతో 200 వికెట్లు మైళురాయిని అందుకున్నాడు.

176 మ్యాచుల్లో 224 తీసిన య‌జువేంద్ర చాహ‌ల్ ఐపీఎస్‌లో అత్య‌ధిక వికెట్ల జాబితాలో మొద‌టి స్థానంలో ఉన్నాడు. భువ‌నేశ్వ‌ర్‌ 192 మ్యాచుల్లో 200 వికెట్లు తీసి రెండో బౌల‌ర్‌గా, 193 వికెట్ల‌తో సునిల్ న‌రైన్ (191 మ్యాచులు) అత‌ని త‌ర్వాతి ప్లేసులో నిలిచాడు.

కాగా, ఐపీఎల్ 2026లో చెన్నై వ‌రుసగా మూడో ఓటమి చవిచూసింది. ఆదివారం ఆర్సీబీ(RCB)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 43 పరుగుల తేడాతో ఓడిపోయి నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 207 రన్స్‌కు ఆలౌటైంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement