Usman Tariq | పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ సరైందేనా..? గవాస్కర్ ఏమన్నారంటే..?
Usman Tariq | ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా జరగనున్న గ్రూప్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడనున్నాయి. గత కొద్ది రోజుల కిందట పాక్ ఆడిన డ్రామా కారణంగా మ్యాచ్ జరగడం సందిగ్ధంలో పడింది.
Usman Tariq | ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా జరగనున్న గ్రూప్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడనున్నాయి. గత కొద్ది రోజుల కిందట పాక్ ఆడిన డ్రామా కారణంగా మ్యాచ్ జరగడం సందిగ్ధంలో పడింది. కానీ మ్యాచ్ ఆడుతామని చెప్పడంతో ఇప్పుడు భారత ఫ్యాన్స్ ఆ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌ను ఓడించాలని కోరుకుంటున్నారు. అయితే పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉస్మాన్ తారిక్ అనే ఆఫ్ స్పిన్నర్ భారత జట్టుకు ప్రమాదకరంగా మారనున్నాడని సర్వత్రా జరుగుతోంది. మరోవైపు అతని బౌలింగ్ యాక్షన్ పై కూడా వివాదం నెలకొంది. కొందరు అతని బౌలింగ్ యాక్షన్ ఇల్లీగల్ అని తప్పుబడుతుంటే, మరికొందరు మాత్రం కరెక్టేనని అంటున్నారు. అయితే దీనిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.
మన ప్లేయర్లు ఎదుర్కోగలరు: గవాస్కర్
పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌ను నేను సరిగ్గా గమనించలేదు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడా కనిపిస్తున్న క్లిప్‌లను మాత్రం చూశా. ఒక బౌలర్‌ను బౌలింగ్ చేయవద్దని ఆపే హక్కు ఎవరికీ ఉండదు. క్రికెట్ రూల్స్ బుక్‌లోనూ అలాంటి నియమాలు లేవు. బౌలర్‌ను బౌలింగ్ చేయవద్దని ఏ రూల్ కూడా చెప్పదు. ఇప్పుడు చాలా మంది అతన్ని బౌలింగ్ చేయవద్దని, కొందరు చేయాలని అంటున్నారు. నిజంగా చాలా మందికి అసలు రూల్స్ తెలియవు. వారు ఎలాంటి రూల్స్ తెలుసుకోకుండానే కామెంట్లు పెడుతున్నారు. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌లో ఆడడం పాకిస్థాన్ బ్యాటర్లకే సమస్య కావడం లేదు. అలాంటప్పుడు ఇండియన్ బ్యాటర్లకు ఎలా సమస్య అవుతుంది..? మన ప్లేయర్లు తారిక్‌ను ఎదుర్కోగలరు. ఆ సత్తా వారిలో ఉంది.. అని గవాస్కర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తారిక్ బౌలింగ్ యాక్షన్ సరైందే: అంపైర్లు
కాగా ఉస్మాన్ తారిక్ ఇప్పటి వరకు మొత్తం అన్నీ కలిపి 42 టీ20 మ్యాచ్‌లలో ఆడాడు. కానీ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ తరఫున కేవలం 4 టీ20లలోనే పాల్గొన్నాడు. అతను ఆ 4 మ్యాచ్ లలో 11 వికెట్లు తీయగా, ఎకానమీ 5.93గా ఉండడం విశేషం. ఉస్మాన్ తారిక్ వాస్తవానికి రెండు రకాల శైలులను తన బౌలింగ్‌లో కలిగి ఉన్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. అతను బౌలింగ్ వేసేటప్పుడు 2 సెకన్ల పాటు బంతిని ఆపి ఉంచడం ఒక శైలి అయితే, అతను శ్రీలంక మాజీ పేస్ బౌలర్ లసిత్ మలింగ మాదిరిగా స్లింగ్ లాంటి యాక్షన్‌ను కలిగి ఉండడం రెండో శైలి అని అంటున్నారు. దీని వల్లే అతని బౌలింగ్‌ను చూసి చాలా మంది కన్ ఫ్యూజ్ అవుతున్నారని, అతను చకింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారని చెబుతున్నారు. అయితే పలువురు అంపైర్లు ఇప్పటికే తారిక్ బౌలింగ్ యాక్షన్‌ను సరైందిగా చెప్పారు. ఈ క్రమంలో భారత్ కూడా మ్యాచ్ అనంతరం అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



