Cricket Matches | క్రికెట్ ప్రేమికులకు వచ్చే 6 నెలలు పండగే.. మ్యాచ్‌లే మ్యాచ్‌లు..!
Cricket Matches | టీమిండియా ఇటీవలే సొంత గడ్డపై సౌతాఫ్రికాతో ఆడిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయి సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వన్డే సిరీస్‌ను, 2-1 తేడాతో, టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుని వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తమకు పోటీ ఎవరూ లేరని నిరూపించింది.
Cricket Matches | టీమిండియా ఇటీవలే సొంత గడ్డపై సౌతాఫ్రికాతో ఆడిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయి సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వన్డే సిరీస్‌ను, 2-1 తేడాతో, టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుని వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తమకు పోటీ ఎవరూ లేరని నిరూపించింది. ఇక ఈ ఏడాదిలో మొదటి 6 నెలల పాటు టీమిండియా ఎడాపెడా సిరీస్‌లలో ఆడనుంది. పైగా ఇతర ముఖ్యమైన టోర్నీలు కూడా ఈ ఏడాదిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే 2026 మొదటి 6 నెలలు క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుందని చెప్పవచ్చు. వరుస పెట్టి మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో కొన్ని నెలల పాటు క్రికెట్ ప్రేమికులు, ఫ్యాన్స్ మ్యాచ్‌లను వీక్షించి ఎంజాయ్ చేయవచ్చు. ఇక జనవరి నెలలో పలు ముఖ్యమైన టోర్నీలు ఉన్నాయి. ఆ తరువాత టీ20 వరల్డ్ కప్, అనంతరం ఐపీఎల్ ఇలా వరుసగా సిరీస్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో..
జనవరిలో టీమిండియా సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జనవరి 11 నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ సిరీస్ లు జరుగుతాయి. ఇక ఇదే నెలలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఐసీసీ మెన్స్ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026ను నిర్వహించనున్నారు. సౌతాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా ఈ టోర్నీ జరగనుంది. అలాగే మరోవైపు భారత మహిళా క్రికెటర్లకు సంబంధించి జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. ఇది దేశవాళీ టీ20 లీగ్ కాగా ఫిబ్రవరి 5వ తేదీన ముగుస్తుంది. అనంతరం ఫిబ్రవరి నెలలో 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు భారత్, శ్రీలంక వేదికలుగా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026ను నిర్వహించనున్నారు.
తరువాత ఐపీఎల్..
ఇక టీ20 వరల్డ్ కప్ అవ్వగానే మరికొద్ది రోజులకు మార్చి 26 నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ 2026 టోర్నీ జరుగుతుంది. దీంతోపాటు భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్ కూడా ఉంది. ఈ టూర్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ఇందులో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో భారత మహిళల జట్టు 3 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. అలాగే ఐపీఎల్ ముగిసిన అనంతరం కొద్ది రోజులకు జూన్ 12 నుంచి జూలై 5వ తేదీ వరకు ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026ను నిర్వహించనున్నారు. అలాగే జూలై 1 నుంచి జూలై 19వ తేదీ వరకు ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. అందులో ఇంగ్లండ్‌తో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇలా 2026 మొదటి 6 నెలలు మొత్తం క్రికెట్‌తో ప్రేక్షకులు అద్భుతమైన వినోదాన్ని పొందనున్నారు.
సంబంధిత వార్తలు

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



