PSL | పాకిస్థాన్ సూపర్ లీగ్ కు ఘోర అవమానం.. జెర్సీ రంగు అంటుకుని పింక్ కలర్‌లోకి మారిన బంతి..
PSL | పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ప్రారంభమైన వెంటనే తొలి మ్యాచ్ నుంచే వివాదం తలెత్తింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో లాహోర్ కలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా బంతి పింక్ రంగులోకి మారింది. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
PSL | పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ప్రారంభమైన వెంటనే తొలి మ్యాచ్ నుంచే వివాదం తలెత్తింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో లాహోర్ కలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా బంతి పింక్ రంగులోకి మారింది. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్ కింగ్స్‌మెన్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ తమ జట్టు జెర్సీ నుంచి రంగు తెల్ల బంతికి అంటుతూ అది క్రమంగా పింక్, తరువాత ఎరుపు రంగులోకి మారుతోందని గమనించి అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో బంతికి స్వింగ్ రాబట్టడం కోసం ప్లేయర్లు బంతికి ఒక వైపు మెరుపు ఉండేలా తమ దుస్తులపై రుద్దడం చేస్తారు. అయితే దుస్తుల నుంచి రంగు బంతికి అంటుకోవడం తన కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదని లబుషేన్ పేర్కొన్నాడు.
జెర్సీ నుంచి బంతికి రంగు అంటుకోవడం ఎన్నడూ చూడలేదు: లబుషేన్
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లబుషేన్ మాట్లాడుతూ రెండో ఓవర్ తర్వాతనే బంతి రంగు మారుతుందని, అది ఎరుపు రంగులో కనిపిస్తుందని అంపైర్లను అడిగానని, అది దుస్తుల వల్లే జరిగిందని భావిస్తున్నట్లు తెలిపానని, అలాంటి ఘటనను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని తెలిపాడు. అయితే ఈ సమస్యను పీఎస్ఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు త్వరగా పరిష్కరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు. బ్యాట్ నుంచి రంగు బంతికి అంటడం లేదా ప్యాడ్ తాకినప్పుడు కొద్దిగా బంతికి రంగు పడడం చూశానని, కానీ జెర్సీ నుంచి బంతికి రంగు అంటుకోవడం మాత్రం ఎప్పుడూ చూడలేదని లబుషేన్ ఈ సందర్భంగా తెలిపాడు. వచ్చే మ్యాచ్‌లకు దీన్ని సరిచేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
https://twitter.com/Sher__Ali/status/2037255483858256344
పీఎస్ఎల్‌కు, పీసీబీకి ఘోర అవమానం..
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ కలందర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, ఆ జట్టులో ఫఖర్ జమాన్ (39 బంతుల్లో 53 పరుగులు, 10 ఫోర్లు), హసీబుల్లాఖాన్ (28 బంతుల్లో 40 పరుగులు నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్), మహమ్మద్ నయీం (19 బంతుల్లో 30 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు 20 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కింగ్స్‌మెన్‌పై కలందర్స్ టీమ్ 69 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. మొదటి పింక్ బాల్ మ్యాచ్ గెలిచినందుకు ప్రత్యర్థి జట్టుకు అభినందనలు అని పోస్ట్‌లో పేర్కొంది. అయితే పీఎస్ఎల్‌లో తొలి మ్యాచ్‌లోనే జరిగిన ఈ సంఘటన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు, ఆ లీగ్‌కు పెద్ద అవమానంగా మారిందని పాక్ మాజీ ప్లేయర్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్ లీగ్‌లో ఇలాంటి నాణ్యత లేని జెర్సీలను ఉపయోగించేందుకు అసలు ఫ్రాంచైజీలు ఎలా అనుమతించాయంటూ మరోవైపు పాక్ అభిమానులు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

David Warner | చిక్కుల్లో డేవిడ్ వార్నర్.. డ్రంక్ డ్రైవ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
ఏప్రిల్ 7, 2026

PSL | పాకిస్థాన్ సూపర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ దుమారం.. ఫఖర్ జమాన్‌పై ఆరోపణలు..
మార్చి 30, 2026

PCB | ముజరబానిపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తి.. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం..
మార్చి 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



