త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PSL | పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ లో బాల్ టాంప‌రింగ్ దుమారం.. ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌పై ఆరోప‌ణ‌లు..

PSL | పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (PSL) లో లాహోర్ క‌లంద‌ర్స్ జ‌ట్టుపై బాల్ టాంపరింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆదివారం క‌రాచీ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో క్రికెట‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ బాల్ టాంప‌రింగ్ చేశాడ‌ని అత‌నిపై ఆరోప‌ణ‌లు న‌మోదు చేశారు. మ్యాచ్ అనంత‌రం రిఫ‌రీ రోష‌న్ మ‌హానామ విచార‌ణ నిర్వ‌హించ‌గా ఫ‌ఖర్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించాడు.

S

Sports | Published On Mar 30, 2026, 12.00 pm IST

PSL | పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ లో బాల్ టాంప‌రింగ్ దుమారం.. ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌పై ఆరోప‌ణ‌లు..
Advertisement

PSL | పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (PSL) లో లాహోర్ క‌లంద‌ర్స్ జ‌ట్టుపై బాల్ టాంపరింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆదివారం క‌రాచీ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో క్రికెట‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ బాల్ టాంప‌రింగ్ చేశాడ‌ని అత‌నిపై ఆరోప‌ణ‌లు న‌మోదు చేశారు. మ్యాచ్ అనంత‌రం రిఫ‌రీ రోష‌న్ మ‌హానామ విచార‌ణ నిర్వ‌హించ‌గా ఫ‌ఖర్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించాడు. ఈ మేర‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇదే విష‌యంపై ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇంకో విచార‌ణ‌ను 48 గంటల్లో చేప‌డ‌తామని, ఆ త‌రువాత మ్యాచ్ రిఫ‌రీ త‌న తుది నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తార‌ని తెలిపింది. ఒక‌వేళ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ దోషిగా తేలితే లెవ‌ల్ 3 త‌ప్పిదం కింద క‌నీస శిక్ష‌గా ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు.

బంతిని టాంప‌రింగ్ చేశారంటూ..

మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో చివ‌ర్ ఓవ‌ర్‌లో ఈ వివాదం చెల‌రేగింది. క‌రాచీ కింగ్స్ విజ‌యం కోసం 14 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. ఫాస్ట్ బౌల‌ర్ హారిస్ రౌఫ్ చివ‌రి ఓవ‌ర్ వేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఆ స‌మ‌యంలో లాహోర్ కెప్టెన్ షాహిన్ షా అఫ్రిది, ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌, బౌల‌ర్ రౌఫ్ ముగ్గురు క‌ల‌సి చ‌ర్చ‌లు జ‌రుపుతూ బంతిని కూడా చేతిలో ప‌ట్టుకున్నారు. మ్యాచ్ కీల‌క ద‌శ‌ల్లో ఆట‌గాళ్లు ఇలా చ‌ర్చించ‌డం సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికీ వారు ఆ స‌మ‌యంలో బంతిని టాంప‌రింగ్ చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో అంపైర్ ఫైస‌ల్ అఫ్రిది బంతిని తీసుకుని ప‌రిశీలించారు. త‌రువాత రెండో అంపైర్ బంగ్లాదేశ్‌కు చెందిన ష‌ర్ఫుద్దౌలాతోనూ దీర్ఘంగా చ‌ర్చించారు. బంతిని ఉద్దేశ పూర్వ‌కంగానే రూపు రేఖ‌లు మార్చార‌ని అంపైర్లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో క‌రాచీ జ‌ట్టుకు 5 పెనాల్టీ ప‌రుగులు ఇచ్చారు. దీంతో క‌రాచీ జ‌ట్టుకు చివ‌రి ఓవ‌ర్‌లో 6 బంతుల్లో 9 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. త‌రువాత అంపైర్లు బంతిని మార్చి ఆట నిర్వ‌హించారు.

https://twitter.com/iMShami_/status/2038315969748295762

దీర్ఘ‌కాల నిషేధం విధిస్తారా..?

చివ‌రి ఓవ‌ర్‌లో తొలి బంతికి క‌రాచీ బ్యాట‌ర్ ఖుష్దిల్ షా ఔట్ అవ‌గా, అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన అబ్బాస్ అఫ్రిది ఒక ఫోర్‌, ఒక సిక్స్ కొట్టి క‌రాచీ కింగ్స్‌కు 19.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల తేడాతో విజ‌యం అందించాడు. అయితే ఈ ఘ‌ట‌న త‌రువాత వారు నిజంగానే బాల్ టాంప‌రింగ్ చేశారా, కెమెరాల్లోనే అలా క‌నిపించిందా, అంపైర్లు త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నారా అనే అంశాల‌పై పీసీబీలో అంత‌ర్గ‌తంగా తీవ్ర చ‌ర్చ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఫ్యాన్స్ సైతం అస‌లు ఆ ముగ్గురిలో బాల్ టాంప‌రింగ్ ఎవ‌రు చేశార‌నే విష‌యం కెమెరాల్లో క‌నిపించ‌లేద‌ని, ఒక ప్లేయ‌ర్‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం మ్యాచ్‌కు చెందిన పూర్తి ఫుటేజ్‌ను ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపింది.

కాగా గ‌తంలో ఆసీస్ జ‌ట్టు సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లోనూ బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డింది. అప్ప‌ట్లో ఆసీస్ ప్లేయ‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, స్టీవ్ స్మిత్‌, కామెరాన్ బ్యాన్ క్రాఫ్ట్‌లు శాండ్ పేప‌ర్‌తో బంతిని టాంప‌రింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిపై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. వారిపై దీర్ఘ‌కాల నిషేధం విధించింది. వాస్త‌వానికి బాల్ టాంప‌రింగ్ అన్న‌ది తీవ్ర‌మైన నేరం. క‌నుక ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌, షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్‌పై కూడా అలాగే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారా, మ‌రో 48 గంట‌ల్లో ఏం తేల్చ‌నున్నారు.. అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement