David Warner | చిక్కుల్లో డేవిడ్ వార్నర్.. డ్రంక్ డ్రైవ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
David Warner | ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ మద్యం సేవించి వివాదంలో చిక్కుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం మారూబ్రా ప్రాంతంలో ర్యాండమ్ బ్రెత్ టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో వార్నర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
David Warner | ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ మద్యం సేవించి వివాదంలో చిక్కుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం మారూబ్రా ప్రాంతంలో ర్యాండమ్ బ్రెత్ టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో వార్నర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. చెక్‌పాయింట్‌కు ముందే అతని కారు ఆగిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ నిర్వహించారు. రోడ్డు పక్కనే చేసిన ఆల్కహాల్ టెస్ట్‌లో వార్నర్ చట్టపరమైన పరిమితిని మించి మద్యం తీసుకున్నట్లుగా తేలింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి మరోసారి పరీక్షించగా.. రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఆస్ట్రేలియాలో అనుమతించిన పరిమితి కంటే రెండింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఘటనపై కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో భాగంగా వార్నర్ మే 7న డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకానున్నారు. ఈ పరిణామం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు 2024లో వీడ్కోలు పలికిన వార్నర్.. ప్రస్తుతం దేశీయ, టీ20 లీగ్‌లలో యాక్టివ్‌గా ఉన్నాడు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్‌లో వార్నర్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. కరాచ కింగ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జట్టును విజయాల బాటలో నడిపిస్తున్ఆనడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కరాచీ కింగ్స్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
క్వెట్టా గ్లాడియేటర్స్‌పై తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కరాచీ, తర్వాత లాహోర్ కలందర్స్‌పై తక్కువ స్కోరు మ్యాచ్‌లో తృటిలో గెలిచింది. తాజాగా రావల్పిండి జట్టుపై 198 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. అయితే, తర్వాతి మ్యాచ్‌కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. వార్నర్‌తో పాటు ఆడమ్ జంపా కూడా తాత్కాలికంగా జట్టుకు దూరమయ్యాడు. కుటుంబంతో గడపడం, విశ్రాంతి కోసం వార్నర్ విరామం తీసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 9న పేషావర్ జల్మీతో జరిగే మ్యాచ్‌కు ముందు తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు. ఆజామ్ ఖాన్‌తో పాటు వార్నర్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ముందున్నాడు. బౌలింగ్‌లో హసన్ అలీ ఎనిమిది వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






