PCB | ముజరబానిపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తి.. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం..
PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) జింబాబ్వే పేసర్ బ్లెసింగ్ ముజరబానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) సీజన్ నుంచి తప్పుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరినందుకు పీసీబీ అతని పట్ల అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.
PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) జింబాబ్వే పేసర్ బ్లెసింగ్ ముజరబానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) సీజన్ నుంచి తప్పుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరినందుకు పీసీబీ అతని పట్ల అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. జింబాబ్వే తరఫున 89 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ముజరబాని, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా అద్భుతంగా రాణించాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ విడుదల చేసిన తర్వాత అతని స్థానంలో ముజరబానిని జట్టులోకి తీసుకుంది.
గతేడాది కూడా ఇలాగే..
పీఎస్ఎల్ సీజన్ 11 కోసం ముజరబానిని ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు రూ.1.10 కోట్లకు (పాకిస్థాన్ కరెన్సీ) కొనుగోలు చేసింది. ఈ సీజన్ మార్చి 26న ప్రారంభం కానుంది. అయితే కోల్‌కతా ఫ్రాంచైజీ అతన్ని సంప్రదించిన తర్వాత అతను ఇస్లామాబాద్ యునైటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కోల్‌కతా జట్టులో చేరి ఐపీఎల్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ టీ20 లీగ్ నుంచి ఆలస్యంగా వైదొలిగినందుకు పీసీబీ ముజరబానిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇలా జరగడం పీఎస్ఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కాదు. గతేడాది సౌతాఫ్రికా ఆల్ రౌండర్ కార్బిన్ బోష్‌ను పీఎస్ఎల్‌కు చెందిన పెషావర్ జల్మీ జట్టు కొనుగోలు చేసింది. కానీ ముంబై ఇండియన్స్ బోష్‌ను ఎంపిక చేయడంతో అతను పీఎస్ఎల్‌ను కాదని, ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో బోష్‌ను పీఎస్ఎల్ నుంచి ఏడాది పాటు నిషేధిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్‌లో ముజరబాని ఉత్తమ ప్రదర్శన..
ఇక టీ20 వరల్డ్ కప్‌లో ముజరబాని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. జింబాబ్వే సూపర్ ఎయిట్స్ దశకు చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. మొత్తం 13 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. కాగా ముజరబానిని జట్టులోకి తీసుకున్న విషయంపై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్టు పెట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం తమ జట్టులో ఆడేందుకు గాను జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానిని తీసుకున్నామని, రూ.2 కోట్లకు ఒప్పందం కుదిరిందని తెలిపింది. అతను బాగా హైట్ ఉన్న బౌలర్ కావడంతోపాటు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అద్బుతంగా రాణిస్తున్నాడని, కీలక సమయాల్లో వికెట్లను తీసే సామర్థ్యం అతనికి ఉందని, టీ20లలో విస్తృతమైన అనుభవం ఉన్నందునే అతన్ని ఎంపిక చేశామని కేకేఆర్ తెలిపింది. ముజరబాని చేరికతో తమ జట్టు పేస్ బలం మరింత పెరిగిందని తెలిపింది.
కాగా ముజరబాని 80కి పైగా అంతర్జాతీయ టీ20లలో 90కి పైగా వికెట్లను తీశాడు. సగటు 21 ఉండగా ఉత్తమ బౌలింగ్ గణాంకాలు 3/8 గా ఉన్నాయి. అయితే ముజరబానిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది.
సంబంధిత వార్తలు

IPL Qualification Scenario | ప్లేఆఫ్ రేసులో కోల్‌కతా నైట్‌రైడర్స్..! సన్‌రైజర్స్ పరిస్థితి ఏంటంటే..?
మే 9, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారిమళ్లింపు
మే 6, 2026

Sunil Narine | ఐపీఎల్లో సునీల్ నరైన సరికొత్త చరిత్ర..! ఇషాన్ వికెట్‌తో ఘనత..!
మే 3, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



