Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
Portugal Vs Spain | ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎన్నో శిఖరాలను అధిరోహించిన క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో ఒకే ఒక్క లోటు. అదే ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ. రెండు దశాబ్దాలకుపైగా ఆ కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించిన దిగ్గజ ప్లేయర్‌కు చివరకు మరోసారి నిరేశా ఎదురైంది. అదనపు సమయంలో మికెల్ మెరినో చేసిన గోల్‌తో స్పెయిన్ 1-0తో పోర్చుగల్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లగా.. ప్రపంచకప్ వేదికపై రొనాల్డో ప్రయాణానికి భావోద్వేగ ముగింపు పలికింది.
- స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓటమి
- క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన జట్టు
- మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్న రొనాల్డో
Portugal Vs Spain | ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎన్నో శిఖరాలను అధిరోహించిన క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో ఒకే ఒక్క లోటు. అదే ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ. రెండు దశాబ్దాలకుపైగా ఆ కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించిన దిగ్గజ ప్లేయర్‌కు చివరకు మరోసారి నిరేశా ఎదురైంది. అదనపు సమయంలో మికెల్ మెరినో చేసిన గోల్‌తో స్పెయిన్ 1-0తో పోర్చుగల్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లగా.. ప్రపంచకప్ వేదికపై రొనాల్డో ప్రయాణానికి భావోద్వేగ ముగింపు పలికింది. చివరి విజిల్ వినిపించిన తర్వాత కొద్దిసేపు రొనాల్డో కదల్లేదు. స్కోర్‌బోర్డును చూస్తూ నిలిచిపోయాడు. చుట్టూ స్పెయిన్ ఆటగాళ్ల సంబరాలు కొనసాగుతుండగా.. తన ప్రపంచకప్ కలకు చెదిరిపోయిందన్న వాస్తవాన్ని మౌనంగా అంగీకరించాడు. అయితే, రొనాల్డో కన్నీళ్లు మాత్రం భావోద్వేగాన్ని దాచలేకపోయాయి.
Cristiano Ronaldo llorando tras jugar su último partido.
Estoy hundido 🥹😭💔pic.twitter.com/MiIx0kiXgY
— (fan) REAL MADRID FANS 🤍 (@AdriRM33) July 6, 2026
వయసు పెరిగినా.. పోరాటం మాత్రం తగ్గలేదు
41 ఏళ్ల వయసులో రొనాల్డో గతంలోలా ప్రత్యర్థి డిఫెన్స్‌ను చీల్చుకుపోయే వేగాన్ని కోల్పోయినా.. పోరాడే తత్వాన్ని మాత్రం వదల్లేదు. బంతిని అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఎటాకింగ్‌కు ప్రయత్నించాడు. స్పెయిన్ డిఫెండర్లతో చివరి వరకు పోరాడాడు. గోల్ చేయలేకపోయినా, జట్టును గెలిపించాలనే తపన మాత్రం ప్రతి క్షణం కనిపించింది. పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ కూడా చివరి వరకు తన కెప్టెన్‌పై నమ్మకం కోల్పోలేదు. రొనాల్డోను పూర్తి మ్యాచ్ ఆడించాడు. కానీ మ్యాచ్ ముగిసే సమయానికి పోర్చుగల్ ఎటాకింగ్‌లో పదును మాత్రం కనిపించలేదు.
స్పెయిన్ ఆధిపత్యం..
మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ బంతిపై ఆధిపత్యం చెలాయించింది. రోడ్రి ఆటను నియంత్రించగా.. పెడ్రి వరుస ఎటాకింగ్‌కు ప్రణాళిక రూపొందించాడు. డాని ఒల్మో అవకాశాలను అందిపుచ్చుకోగా.. పోర్చుగల్ డిఫెన్స్ మాత్రం అసాధారణంగా నిలిచింది. గోల్‌కీపర్ డియోగో కోస్టా అద్భుతంగా సేవ్స్‌తో జట్టును ఆదుకోగా.. రూబెన్ డియాస్-రెనాటో వేగా జోడీ స్పెయిన్ ఎటాకింగ్‌ను అడ్డుకుంది. ఎడమ వైపున నునో మెండెస్ యువ సంచలనం లామిన్ యమాల్‌ను దాదాపు మ్యాచ్ మొత్తం కట్టడి చేశాడు. అయితే, గాయంతో మెండెస్ మైదానం వీడిన తర్వాత స్పెయిన్ ఎటాకింగ్‌కు మరింత స్వేచ్ఛ లభించినట్లయ్యింది.
పోర్చుగల్‌కు రొనాల్డోనే పెద్ద సమస్య..
ఈ మ్యాచ్‌లో రొనాల్డో విఫలమయ్యాడని చెప్పడం కష్టమే. కానీ, పోర్చుగల్ అతడిపైనే ఇంకా ఎక్కువగా ఆధారపడిందనడమే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. రెండో అర్ధభాగంలో బంతి కోసం రొనాల్డో మిడ్‌ఫీల్డ్ వరకు రావాల్సి వచ్చింది. ముందువరుసలో బంతిని తీసుకునే ఆటగాళ్లు లేకపోవడంతో ప్రతి ఎటాకింగ్ మధ్యలోనే ఆగిపోయింది. రెండు దశాబ్దాలుగా జట్టును భుజాలపై మోసిన ఆటగాడు.. తన చివరి ప్రపంచకప్‌లో కూడా అదే బాధ్యతను మోసేందుకు ప్రయత్నించడం అభిమానులను కదిలించి వేసింది.
ఒక్క క్షణమే ముగింపు
నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇచ్చిన అదనపు సమయంలో పోర్చుగల్ కల చెదిరిపోయింది. త్వరగా తీసిన ఫ్రీకిక్‌ను ఫాబియన్ రూయిజ్ ఫెరాన్ టొర్రెస్‌కు అందించాడు. ఒక్క టచ్‌తో బంతిని ముందుకు వదలగా.. డిఫెన్స్ మధ్య ఖాళీని గుర్తించిన మికెల్ మెరినో వేగంగా దూసుకొచ్చి కోస్టాను దాటి బంతిని గోల్‌లోకి పంపించాడు. 90 నిమిషాల పాటు క్రమశిక్షణతో ఆడిన పోర్చుగల్ ఒక్క తప్పిదంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
beautiful goal from Arsenal man Mikel Merino
🇵🇹Portugal 1 - 0 Spain 🇪🇸 pic.twitter.com/NzOaOjKIOK
— haider〽️ (@yahoodisaazish) July 6, 2026
మార్టినెజ్‌పై విమర్శలు
మ్యాచ్ అనంతరం కోచ్ రాబర్టో మార్టినెజ్ నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా నిలిచాయి. కీలక సమయంలో గోన్సాలో రామోస్‌ను బరిలోకి దించకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అన్ని మార్పులు చేసినా రొనాల్డోను మాత్రం పూర్తి సమయం కొనసాగించడం విమర్శలకు దారితీసింది. బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా, విటిన్హా, రఫాయెల్ లియావో, నునో మెండెస్, డియోగో కోస్టా వంటి ప్రతిభావంతులున్నా.. పోర్చుగల్ ఈ ప్రపంచకప్‌లో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని ముద్ర
ప్రపంచకప్ ట్రోఫీ రొనాల్డోకు అందకపోయినా.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని ముద్రవేశాడు. 140కుపైగా ఇంటర్నేషనల్ గోల్స్, 220కుపైగా మ్యాచ్‌లు, యూరో-2016 విజయం, నేషన్స్ లీగ్ టైటిళ్లు జట్టుకు సాధించి పెట్టాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో రొనాల్డో పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. అంతేకాదు ఈ ప్రపంచకప్ పోర్చుగల్ భవిష్యత్తుపై కూడా ఆశలు రేకెత్తించింది. నునో మెండెస్, డియోగో కోస్టా, రెనాటో వేగా, బ్రూనో ఫెర్నాండెజ్, విటిన్హా, రఫాయెల్ లియావో, గోన్సాలో రామోస్ వంటి ఆటగాళ్లతో కొత్త శకానికి బలమైన పునాది కనిపిస్తోంది. ప్రపంచకప్ ట్రోఫీ రొనాల్డోకు కల ఫలించలేదు కానీ.. పోర్చుగల్ ఫుట్‌బాల్‌ను ప్రపంచ వేదికపై నిలబెట్టిన మహా అధ్యాయం రొనాల్డో పేరును చిరస్థాయిగా నిలబెడుతుంది. కన్నీళ్లతో మైదానం వీడిన ఆ క్షణం.. ఓ లెజెండ్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలికిన క్షణంగా ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోతుంది.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



