Imran Khan | ఇమ్రాన్‌కు వైద్యం అందించండి.. పాక్ ప్రభుత్వానికి గవాస్కర్, కపిల్ దేవ్ సహా 14 మంది మాజీ కెప్టెన్ల లేఖ..!
Imran Khan, Imran Khan Health, Pakistan, Pakistan Cricket, Sunil Gavaskar, Kapil Dev, Shahbaz Sharif, Greg Chappell, Clive Lloyd, Steve Waugh, Prison Health, Ex Cricket Captains,
Imran Khan | పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మాజీ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి సంయుక్త లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ లేఖపై 14 మంది మాజీ కెప్టెన్లు సంతకాలు చేశారు. అందులో భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. లేఖలో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అవసరమైన నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యసేవలు అందించాలని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కోరారు.
సంతకాలు చేసిన వారిలో గ్రెగ్ చాపెల్, బెలిండా క్లార్క్, మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సైన్, ఇయాన్ చాపెల్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రియర్లే, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్ వంటి అంతర్జాతీయ క్రికెట్ ప్రముఖులు ఉన్నారు. లేఖలో తాము తమ తమ దేశాల జాతీయ జట్లకు మాజీ కెప్టెన్లమని పేర్కొంటూ, ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్, నాయకుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ముఖ్యంగా 1992 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు చారిత్రక విజయం అందించడంతో పాటు ఆయన నాయకత్వాన్ని ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలను సైతం లేఖలో పేర్కొన్నారు. కుడి కన్ను చూపు సుమారు 85 శాతం తగ్గిందని, సరైన వైద్యసేవలు అందడం లేదని పేర్కొన్నారు. జైలులో ఉన్నప్పటికీ మానవీయ, గౌరవప్రదమైన పరిస్థితులు కల్పించాలని కోరారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్నారు. 2022లో అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆయనపై పలు అవినీతి కేసులు నమోదు అయ్యాయి. గతేడాది డిసెంబరులో కోర్టు ఆయనకు 31 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇదిలా ఉండగా, ఇటీవల వసీమ్ అక్రం, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది వంటి మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా మెరుగైన వైద్యం అందించాలని కోరినా, ఈ సంయుక్త లేఖపై మాత్రం సంతకం చేయలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






