త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Under 19 World Cup | టాస్ గెలిచిన‌ బంగ్లాదేశ్‌.. భార‌త్ బ్యాటింగ్‌ ఫ‌స్ట్

Under 19 World Cup | అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో (Under 19 World Cup) జోరుమీదున్న భారత్‌.. బంగ్లాదేశ్‌తో (Bangladesh) త‌ల‌ప‌డుతున్న‌ది. టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌.. యువ భార‌త్‌ను (Team India) బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

G

Cricket | Published On Jan 17, 2026, 1.20 pm IST

Under 19 World Cup | టాస్ గెలిచిన‌ బంగ్లాదేశ్‌.. భార‌త్ బ్యాటింగ్‌ ఫ‌స్ట్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో (Under 19 World Cup) జోరుమీదున్న భారత్‌.. బంగ్లాదేశ్‌తో (Bangladesh) త‌ల‌ప‌డుతున్న‌ది. టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌.. యువ భార‌త్‌ను (Team India) బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా, మధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు టాస్‌ వేయాల్సి ఉండగా.. వర్షం కారణంగా అది వాయిదా పడింది. అయితే వాన నిలిచిపోవ‌డంతో మ్యాచ్ ముందుకు సాగుతున్న‌ది. ఈ ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి మ్యాచ్ క‌గా, భారత్ ఇప్ప‌టికే ఒక విజ‌యం సాధించి ఉన్న‌ది. త‌న తొలిమ్యాచ్‌లో అమెరికాను ఆయుష్ మాత్రే బృందం (Ayush Mhatre) మ‌ట్టిక‌రిపించింది.

కాగా, ఐదుసార్లు ఛాంపియన్ అయిన‌ భారత్‌ను నిలువరించడం బంగ్లా జ‌ట్టుకు తేలికేం కాదు. తొలి మ్యాచ్‌లో అమెరికాపై విజృంభించిన పేసర్‌ హెనిల్‌ పటేల్‌ మరోసారి సత్తా చాటితే బంగ్లాదేశ్ గెలుపు కష్టమే. తొలి మ్యాచ్‌లో విఫలమైన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) బ్యాంటింగ్‌ పైనే అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మైంది. అతడికి తోడు ఆయుష్‌ మాత్రే, ఆరోన్‌ జార్జి, అభిజ్ఞాన్‌ కుందు రాణిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు.

భార‌త జ‌ట్టు..

ఆయుష్ మాత్రే, వైభ‌వ్ సూర్య‌వంశీ, వేదాంత్ త్రివేది, విహాన్ మ‌ల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, క‌నిష్క్ చౌహాన్‌, హ‌ర్వంశ్ పంగాలియా, ఆర్ఎస్ అంబ్రీశ్‌, హెనీల్ ప‌టేల్‌, బీపేశ్ దేవేంద్ర‌న్‌, ఖిలాన్ ప‌టేల్‌

బంగ్లా టీమ్‌..

ఎండీ రిఫాత్ బేగ్‌, జావ‌ద్ అబ్రార్‌, ఎండీ అజీజుల్‌, క‌లామ్ సిద్దికీ అలీన్‌, రిజాన్ హోస్స‌న్‌, ఫ‌రీద్ హ‌స‌న్‌, స‌మియ‌న్ బ‌శీర్‌, షేక్ పైవేజ్ జిబాన్‌, అల్ ఫ‌హ‌ద్‌, సాద్ ఇస్లామ్ రాజిన్‌, ఇక్బాల్ హొస్సైన్

 

Advertisement

తాజావార్తలు

Advertisement