YouTube | యూట్యూబ్‌తో భారత్‌కు భారీ ఆర్థిక ప్రయోజనం.. రూ.18 వేల కోట్ల జీడీపీకి దోహదం..
YouTube | ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సృజనాత్మక వ్యవస్థ 2025లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి రూ.18వేల కోట్లకు పైగా దోహదం చేసిందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో దేశంలో 9.6 లక్షలకు పైగా పూర్తి కాల ఉద్యోగాలకు సమానమైన ఉపాధిని యూట్యూబ్ సృష్టించినట్లు నివేదిక తెలిపింది.
YouTube | ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సృజనాత్మక వ్యవస్థ 2025లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి రూ.18వేల కోట్లకు పైగా దోహదం చేసిందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో దేశంలో 9.6 లక్షలకు పైగా పూర్తి కాల ఉద్యోగాలకు సమానమైన ఉపాధిని యూట్యూబ్ సృష్టించినట్లు నివేదిక తెలిపింది. భారత్‌లో డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల రంగం వేగంగా మారుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. స్వతంత్రంగా కంటెంట్ రూపొందించే సృష్టికర్తలు క్రమంగా పూర్తి స్థాయి మీడియా సంస్థలుగా ఎదుగుతున్నారని తెలిపింది. దీని ద్వారా మహానగరాలతోపాటు చిన్న పట్టణాల్లోనూ ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని వెల్లడించింది.
18వేలకు పైగా భారీ చానల్స్..
భారత్‌లో సంవత్సరానికి రూ.లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న యూట్యూబ్ ఛానళ్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 30 శాతానికి పైగా పెరిగిందని నివేదిక తెలిపింది. అలాగే దేశంలో 18వేలకు పైగా యూట్యూబ్ ఛానళ్లు ఇప్పటికే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటినట్లు పేర్కొంది. యూట్యూబ్‌లో కంటెంట్ ద్వారా ఆదాయం పొందుతున్న సృష్టికర్తల్లో 73 శాతం మంది తమ ప్రధాన ఆదాయ వనరుగా ఈ వేదికనే పరిగణిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రత్యక్ష ఆదాయంతోపాటు యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందుతున్న సృష్టికర్తలు గతేడాది కాలంలో 3 లక్షలకు పైగా శిక్షణార్థులకు ఉపాధి, శిక్షణ అవకాశాలకు మద్దతు అందించినట్లు నివేదిక తెలిపింది. జైపూర్, లక్నో, కొచ్చి వంటి మహానగరాలు కాని ప్రాంతాల్లో సృజనాత్మక రంగాలకు సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. దీంతో వీడియో ఎడిటర్లు, కెమెరా ఆపరేటర్లు, స్క్రిప్ట్ రచయితలకు స్థానికంగా డిమాండ్ పెరుగుతోందని తెలిపింది.
బయటి దేశాల నుంచి పెరిగిన వీక్షణ..
స్థానిక ప్రాంతాలకు సంబంధించిన, ప్రాంతీయ భాషల్లో రూపొందుతున్న కంటెంట్‌కు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోందని యూట్యూబ్ పేర్కొంది. భారతీయ ఛానళ్లలో రూపొందుతున్న కంటెంట్‌కు లభిస్తున్న మొత్తం వీక్షణ సమయాల్లో 15 శాతానికి పైగా దేశం వెలుపల ఉన్న ప్రేక్షకుల నుంచే వస్తున్నట్లు తెలిపింది. యూట్యూబ్‌లో తమ ఉనికిని కలిగి ఉన్న మీడియా సంస్థల్లో 81 శాతం సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవడంలో యూట్యూబ్ తమకు సహాయపడిందని తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది కాలంలో భారతీయ ఛానళ్ల నుంచి 16 కోట్ల గంటలకు పైగా కంటెంట్ అప్‌లోడ్ అయినట్లు నివేదిక పేర్కొంది. జాతీయ స్థాయిలో డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు క్రియేట్ విత్ ఏఐ కార్యక్రమం కింద సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. అలాగే భారత వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు సంప్రదాయ జానపద, గిరిజన సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించింది.
క్రియేటర్ల కోసం అనేక టూల్స్..
ఉత్పత్తుల పరంగా కృత్రిమ మేధ ఆధారిత వీడియో తయారీ సాధనాలను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకువస్తోంది. షార్ట్స్ కోసం సంభాషణ ఆధారిత ఏఐ ఎడిటింగ్, ఆస్క్ స్టూడియోలో స్వయంచాలకంగా పనిచేసే ఛానల్ నిర్వహణ వంటి సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపింది. డిజిటల్ కంటెంట్ విశ్వసనీయతను పెంచే చర్యల్లో భాగంగా ఏఐ లైకెనెస్ డిటెక్షన్ సదుపాయాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు యూట్యూబ్ పేర్కొంది. కృత్రిమంగా రూపొందించిన కంటెంట్‌ను గుర్తించేందుకు స్పష్టమైన లేబుళ్లు, వెల్లడింపులతోపాటు ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
సంబంధిత వార్తలు

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
సెప్టెంబర్ 29, 2026

Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా
సెప్టెంబర్ 27, 2026

LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | ఆ మొత్తం వీడియో ఫుటేజీ ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌ను కోరిన మాజీ మంత్రి వేముల
- ●Harish Rao | ఆ మహోన్నత పోరాటానికి 14 ఏండ్లు.. తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం సాగరహారం: హరీశ్ రావు
- ●Jawan Opens Fire | తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
- ●Indian Coast Guard | అరేబియా సముద్రంలో రూ.3వేల కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్.. ఐదుగురు పాక్ జాతీయులు అరెస్ట్
- ●Veeramachineni Ramakrishna | వీఆర్కే డైట్ సృష్టికర్త.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

Vemula Prashanth Reddy | ఆ మొత్తం వీడియో ఫుటేజీ ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌ను కోరిన మాజీ మంత్రి వేముల

Harish Rao | ఆ మహోన్నత పోరాటానికి 14 ఏండ్లు.. తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం సాగరహారం: హరీశ్ రావు

Jawan Opens Fire | తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన పసిడి ధరలు..



