త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Laxman | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు

MP Laxman | తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2029లోనే జ‌రుగుతాయ‌ని రాజ్య‌స‌భ ఎంపీ డాక్ట‌ర్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు, త‌ర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో 2029లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చెప్పారు.

S

Telangana | Published On Nov 27, 2026, 8.17 pm IST

MP Laxman | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు
Advertisement

5 నెల‌ల పాటు రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించే ఛాన్స్
మీడియాతో ఎంపీ ల‌క్ష్మ‌ణ్ చిట్‌చాట్

MP Laxman | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2029లోనే జ‌రుగుతాయ‌ని రాజ్య‌స‌భ ఎంపీ డాక్ట‌ర్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు, త‌ర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో 2029లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చెప్పారు. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు 5 నెల‌ల పాటు రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించవ‌చ్చ‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి డీలిమిటేష‌న్ బిల్లు పాస్ కాక‌పోతే.. ఆ త‌ర్వాత జ‌నాభాకు అనుగుణంగా చేయాల్సి వస్తుంద‌న్నారు. జీడీపీ ఆధారంగా సీట్లు పెంచాల‌ని రేవంత్ అంటున్నారు.. మ‌రి జీడీపీ ప్ర‌తి ఏడాది మారుతుంది.. ఎంపీ సీట్లు కూడా ప్ర‌తి ఏడాది పెంచ‌డం, త‌గ్గించ‌డం సాధ్యమా..? అని అడిగారు. డీలిమిటేషన్ ప్రతి పదేండ్ల‌కు ఒక సారి జరుగుతుందన్న లక్ష్మణ్‌.. సీట్లు పెరిగితే ఎస్సీ, ఎస్టీల సీట్లు పెరగవా.. చట్టసభల్లో వాళ్ల గొంతు పెరగదా? చెప్పాలన్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు.

Advertisement
Advertisement