త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xiaomi TV S Mini LED Series | సినిమా థియేట‌ర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్‌తో.. బ‌డ్జెట్ ధ‌ర‌ల‌కే షియోమీ కొత్త టీవీలు..

Xiaomi TV S Mini LED Series | మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ త‌న లేటెస్ట్ ఎల్ఈడీ టీవీ మోడ‌ల్స్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ 2026లో ఈ మోడల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సిరీస్‌లో 55, 65, 75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ క‌లిగిన టీవీల‌ను అందుబాటులో ఉంచారు. 75 ఇంచుల మోడ‌ల్ టీవీలో 512 లోక‌ల్ డిమ్మింగ్ జోన్‌ల‌ను ఇచ్చారు.

S

Business | Published On Apr 17, 2026, 5.18 pm IST

Xiaomi TV S Mini LED Series | సినిమా థియేట‌ర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్‌తో.. బ‌డ్జెట్ ధ‌ర‌ల‌కే షియోమీ కొత్త టీవీలు..
Advertisement

Xiaomi TV S Mini LED Series | మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ త‌న లేటెస్ట్ ఎల్ఈడీ టీవీ మోడ‌ల్స్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ 2026లో ఈ మోడల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సిరీస్‌లో 55, 65, 75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ క‌లిగిన టీవీల‌ను అందుబాటులో ఉంచారు. 75 ఇంచుల మోడ‌ల్ టీవీలో 512 లోక‌ల్ డిమ్మింగ్ జోన్‌ల‌ను ఇచ్చారు. అందువ‌ల్ల బ్యాక్ లైట్ మ‌రింత మెరుగ్గా కంట్రోల్ అవుతుంది. తెర‌పై క్వాలిటీ క‌లిగిన విజువల్స్ ల‌భిస్తాయి. ఇక అన్ని సైజ్ టీవీల్లోనూ పీక్ బ్రైట్ నెస్‌ను 1200 నిట్స్ వ‌ర‌కు ఇచ్చారు. అందువ‌ల్ల చుట్టు ప‌క్క‌ల కాంతి టీవీ తెర‌పై ప‌డినా తెర చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

అడ్వాన్స్‌డ్ విజువ‌ల్ టెక్నాల‌జీలు..

షియోమీ విడుద‌ల చేసిన ఈ టీవీ సిరీస్ లో 4కె అల్ట్రా హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. అలాగే ఎంఈఎంసీ, ఏఐ గేమ్ బూస్ట్ 120 హెడ్జ్ వంటి ఫీచ‌ర్ల‌ను గేమ‌ర్స్ కోసం ప్ర‌త్యేకంగా ఇచ్చారు. క‌ల‌ర్ రీ ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో డీసీఐ-పీ3 92 శాతం నుంచి 94 శాతం వ‌ర‌కు క‌వ‌రేజ్ ఇస్తుంది. హెచ్‌డీఆర్10 ప్ల‌స్ స‌ర్టిఫికేష‌న్ ఉన్నందున హై రిజ‌ల్యూష‌న్ క‌లిగిన వీడియోలు, సినిమాల‌ను అద్భుత‌మైన క్వాలిటీతో వీక్షించ‌వ‌చ్చు. అలాగే హెచ్ఎల్‌జీ, డాల్బీ విజ‌న్‌, ఫిల్మ్ మేక‌ర్ మోడ్ వంటి అడ్వాన్స్‌డ్ విజువ‌ల్ టెక్నాల‌జీల‌ను కూడా ఈ టీవీల్లో అందిస్తున్నారు. బ్రైట్ నెస్ క‌నిష్టంగా 510 నిట్స్‌, నార్మ‌ల్ రేంజ్ అయితే 600 నిట్స్‌, గ‌రిష్టంగా 1200 నిట్స్ వ‌ర‌కు ఉంటుంది. డిమ్మింగ్ జోన్లు 55 ఇంచుల మోడ‌ల్స్‌లో 308, 65 ఇంచుల మోడ‌ల్స్‌లో 384, 75 ఇంచుల టీవీల్లో 512గా ఉన్నాయి.

ప‌వ‌ర్ ఫుల్ ఆడియో ఫీచ‌ర్లు..

షియోమీ లాంచ్ చేసిన ఈ టీవీ మోడల్స్ గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ టీవీ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో క్వాడ్ కోర్ కార్టెక్స్ ఎ55 ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్ వంటి స‌దుపాయాల‌ను ఇచ్చారు. బ్లూటూత్ 5.2, వైఫై 6, మూడు హెచ్‌డీఎంఐ 2.1 పోర్టులు, రెండు యూఎస్‌బీ 2.0 పోర్టులు, ఈథ‌ర్ నెట్ పోర్టు, ఆప్టిక‌ల్ ఆడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాల‌ను అందించారు. ఈ మోడ‌ల్స్‌లో 34 వాట్స్ సామ‌ర్థ్యం క‌లిగిన 4 స్పీక‌ర్ల‌ను ఆడియో కోసం ఇచ్చారు. వాటిల్లో 2 ట్వీట‌ర్లు కాగా, 2 ఫుల్ రేంజ్ స్పీక‌ర్లుగా పనిచేస్తాయి. డాల్బీ ఆడియో, డీటీఎస్ ఎక్స్‌, డీటీఎస్ వ‌ర్చువ‌ల్ ఎక్స్‌, షియోమీ సౌండ్ వంటి టెక్నాజీల‌ను ఇచ్చినందున వాటిని స‌పోర్ట్ చేసే హోమ్ థియేట‌ర్ సిస్ట‌మ్‌ల‌ను టీవీల‌కు క‌నెక్ట్ చేస్తే అద్భుత‌మైన థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొంద‌వ‌చ్చు.

ధ‌ర వివ‌రాలు..

55 ఇంచుల మోడ‌ల్ టీవీ ధ‌ర‌లు రూ.51,999కు ప్రారంభం అవుతుండ‌గా, 65 ఇంచుల టీవీల‌ను రూ.71,999 ప్రారంభ ధ‌ర‌కు ఇస్తున్నారు. 75 ఇంచుల మోడ‌ల్ టీవీల ప్రారంభ ధ‌ర రూ.99,999గా ఉంది. షియోమీ లాంచ్ చేసిన ఈ కొత్త టీవీ మోడ‌ల్స్‌ను అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్ లైన్ స్టోర్‌, షియోమీ రిటెయిల్ స్టోర్స్‌లో వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. వీటిని ప్ర‌స్తుతం ప్రీ ఆర్డ‌ర్ విధానంలో విక్ర‌యిస్తున్నారు. అంటే కావాల‌నుకున్న టీవీని ముందుగా వినియోగ‌దారులు ఆర్డ‌ర్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రీ ఆర్డ‌ర్ ఆఫ‌ర్ల‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల‌పై ఫ్లాట్ రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే రూ.6,499 విలువైన 4 సంవ‌త్స‌రాల వారంటీని కూడా ఉచితంగా అందిస్తున్నారు. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే థియేట‌ర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే టీవీలు కావాల‌ని చూస్తున్న వారు షియోమీ లాంచ్ చేసిన ఈ మోడ‌ల్స్‌పై ఓ లుక్కేయ‌వ‌చ్చు.

Advertisement
Advertisement