త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Account | కేవైసీ చేయ‌క‌పోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో నిజ‌మెంత‌..?

Bank Account | భారత్‌లో డిజిటలైజేషన్‌ వేగం పెరిగినప్పటి నుంచి బ్యాంకింగ్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ సేవల్లో చాలా వరకు ఫోన్‌ ద్వారానే కొనసాగుతున్నాయి. కేవైసీ లేదా ఇతర వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాంకులు సాధారణంగా ఖాతాదారుల ఫోన్‌కు మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్స్‌ పంపుతుంటాయి.

S

Business | Published On Aug 12, 2026, 2.09 pm IST

Bank Account | కేవైసీ చేయ‌క‌పోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో నిజ‌మెంత‌..?
Advertisement

Bank Account | భారత్‌లో డిజిటలైజేషన్‌ వేగం పెరిగినప్పటి నుంచి బ్యాంకింగ్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ సేవల్లో చాలా వరకు ఫోన్‌ ద్వారానే కొనసాగుతున్నాయి. కేవైసీ లేదా ఇతర వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాంకులు సాధారణంగా ఖాతాదారుల ఫోన్‌కు మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్స్‌ పంపుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ కొందరికి మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే ఈ మెసేజ్‌కు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది.

ఏం మెసేజ్‌ వైరల్‌ అవుతోంది?

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో రూపొందించిన ఓ నకిలీ నోటీసు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. ఆధార్‌, పాన్‌తో అనుసంధానమైన కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేయకపోతే ఖాతాదారుల బ్యాంక్‌ ఖాతాలు వెంటనే మూసివేస్తారని ఈ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవడానికి బీఓఐ మొబైల్‌ డిజిటల్‌ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని అందులో సూచించారు. ఈ వైరల్‌ నోటీసుపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఈ వైరల్‌ మెసేజ్‌ను పరిశీలించి, అది పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో జారీ చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఈ నోటీసులో ఆధార్‌, పాన్‌ కేవైసీని అప్‌డేట్‌ చేయకపోతే ఖాతాలు వెంటనే బ్లాక్‌ అవుతాయని పేర్కొంటున్నారని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తెలిపింది.

https://twitter.com/PIBFactCheck/status/2087144188131590549

ప్ర‌జ‌లు న‌మ్మొద్దు..

అలాగే కేవైసీ అప్‌డేట్‌ కోసం బీఓఐ మొబైల్‌ డిజిటల్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఈ నకిలీ నోటీసులో కోరుతున్నారని వెల్లడించింది. అయితే ఈ నోటీసు పూర్తిగా కల్పితమైనదని, దీనిని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లేదా ఆర్‌బీఐ జారీ చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న చిత్రం కూడా నకిలీదేనని తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో వైరల్‌ అవుతున్న ఈ నకిలీ నోటీసును ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వం సూచించింది. ఇలాంటి మెసేజ్‌లు, లింకులు లేదా అప్లికేషన్లను నమ్మి డౌన్‌లోడ్‌ చేయడం, ఇన్‌స్టాల్‌ చేయడం చేయవద్దని ఖాతాదారులకు హెచ్చరించింది. బ్యాంకుకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌, సంబంధిత బ్యాంక్‌ శాఖ లేదా ఇతర అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని సూచించింది. కేవ‌లం ఈ బ్యాంకు మాత్ర‌మే కాకుండా, ఏ బ్యాంకులోనైనా స‌రే కేవైసీ చేయాల‌ని లేదంటే అకౌంట్ క్లోజ్ అవుతుంద‌ని వ‌చ్చే మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్స్‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, స‌మీపంలోని బ్రాంచిని సంప్ర‌దించాల‌ని తెలియ‌జేసింది.

Advertisement
Advertisement