త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Harish Rao | తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో బీఆర్ఎస్ నిల‌దీస్తే గానీ సోయి రాదా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. జీఆర్ఎంబీ ఎజెండాను స‌వ‌రించాల‌ని బోర్డుకు రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసిన నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు స్పందించారు.

S

Telangana | Published On Aug 12, 2026, 1.53 pm IST

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో బీఆర్ఎస్ నిల‌దీస్తే గానీ సోయి రాదా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. జీఆర్ఎంబీ ఎజెండాను స‌వ‌రించాల‌ని బోర్డుకు రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసిన నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు స్పందించారు.

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే.. ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు? తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు జీఆర్ఎంబీని నిలదీయలేదు? ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప.. తెలంగాణ ప్రయోజనాల పట్ల మీకు అసలు చిత్తశుద్ధి లేదా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. మీ నామమాత్రపు లేఖలు తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుతాయా? లేఖలతో పనులు కావు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు

ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అవి ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలి. అవసరమైతే.. ఆ అంశాలు వెనక్కి తీసుకోకపోతే జీఆర్ఎంబీ సమావేశానికి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలి. అలా కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మీటింగ్‌కు వెళ్లి.. అక్కడ తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

జల ద్రోహాన్ని అడ్డుకుంటాం..

రేవంత్ రెడ్డి.. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన విషయం. ప్రతిపక్షాలపై పిచ్చి ప్రేలాపనలు చేసే రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబితే ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగే జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాను ఉపసంహరించుకోకుండా నిర్వహిస్తే.. తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరిస్తున్నాం. కేంద్రం చేతిలో ఉన్న జీఆర్ఎంబీ, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటామ‌ని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement