Modi Government | 110 మిలియన్ల టీవీలు త్వరలో బంద్.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
Modi Government | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలోనే దేశంలో 110 మిలియన్ల టీవీలను నిలిపివేయబోతోందని, టీవీ ప్రసారాల ఖర్చు భారీగా పెరగబోతోందని ఇటీవలి కాలంలో ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది.
Modi Government | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలోనే దేశంలో 110 మిలియన్ల టీవీలను నిలిపివేయబోతోందని, టీవీ ప్రసారాల ఖర్చు భారీగా పెరగబోతోందని ఇటీవలి కాలంలో ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, ఇందులో ఎంత మాత్రం నిజం లేదని ఆ వార్తను ఖండించింది. ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ఇలాంటి వార్తలను నమ్మవద్దని, అధికారిక వేదికల ద్వారానే సమాచారం తెలసుకోవాలని సూచించింది. కాగా పోస్టులో పేర్కొన్న ప్రకారం ప్రధాని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందని, దీంతో 110 మిలియన్ల టీవీలను నిలిపివేయనున్నారని, ఇప్పటికే ఫోన్ల కారణంగా 10 మిలియన్ల టీవీలను ప్రజలు వాడడం లేదని, కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో టీవీల తయారీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుందని ప్రచారం చేస్తున్నారు.
ప్రచారం అవాస్తవం..
అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జూన్ 12న కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసిందని, టీవీ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు, టెలికాం కంపెనీలకు ఒకే విధమైన నిబంధనలు అమలు చేయనున్నారని పోస్టులో పేర్కొన్నారు. ఈ నిబంధనల ద్వారా ప్రభుత్వానికి భారీ లైసెన్స్ ఫీజులు లభిస్తాయని కూడా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ మార్పుల కారణంగా టీవీ బ్రాడ్‌కాస్టింగ్ సేవలు చాలా ఖరీదవుతాయని, డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లు తమ ఛార్జీలను నాలుగు నుంచి ఆరు రెట్లు పెంచుతారని, చివరికి డీటీహెచ్, కేబుల్ టీవీ సేవలే నిలిచిపోతాయని పోస్టులో ఆరోపించారు. దీంతో టీవీ సేవలు ఒక్కసారిగా ఆగిపోవడమే కాకుండా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని కూడా పేర్కొన్నారు. అయితే ఈ ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పూర్తిగా ఖండించింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన పీఐబీ, వైరల్ అవుతున్న ఈ పోస్టు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. టీవీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు నాలుగు నుంచి ఆరు రెట్లు పెరిగేలా లేదా దేశవ్యాప్తంగా టీవీ సేవలు నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను తీసుకురాలేదని వెల్లడించింది.
https://twitter.com/PIBFactCheck/status/2079075970221535459
ఆధారాలు లేవు..
పీఐబీ తెలిపిన వివరాల ప్రకారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్స్ (టెలివిజన్, రేడియో అండ్ రిలేటెడ్ సర్వీసెస్) రూల్స్-2026 ముసాయిదాను విడుదల చేసిందని, ఈ ముసాయిదాపై ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి జూలై 27 వరకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తున్నారని తెలిపింది. ఈ ముసాయిదా నిబంధనల్లో టీవీ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు పెంచే ఎలాంటి ప్రతిపాదన లేదని పీఐబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం టీవీ, రేడియో సేవలకు సంబంధించిన వివిధ మార్గదర్శకాలను ఒకే చోట సమీకరించి, నిబంధనలను సరళీకరించడం, ఒకే విధంగా అమలు చేయడం ద్వారా టీవీ, రేడియో ప్రసార రంగం మరింత సులభంగా పనిచేసేలా చేయడమే ఈ ముసాయిదా లక్ష్యమని తెలిపింది. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని, కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టత ఇచ్చింది.
సంబంధిత వార్తలు

Instagram | ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ? నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
జులై 28, 2026

Sonia Gandhi | విద్యార్థులను దేశ శత్రువులుగా చూస్తోంది.. మోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ మండిపాటు
జులై 24, 2026

NEET retest paper leak | నీట్ రీఎగ్జామ్ పేపర్ లీక్..? ఎన్టీఏ ఏమన్నదంటే..?
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!
- ●Bonalu | న్యూయార్క్లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
- ●Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!

Bonalu | న్యూయార్క్లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి

TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!



