Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..
Post Office RD | పోస్టాఫీస్ ద్వారా ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను నిర్వహిస్తోంది. ఈ చిన్న పొదుపు పథకాలలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే.. తక్కువ మొత్తంలో పొదుపు చేసినా, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవచ్చు. అలాంటి అద్భుతమైన పథకాలలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ఒకటి.
Post Office RD | పోస్టాఫీస్ ద్వారా ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను నిర్వహిస్తోంది. ఈ చిన్న పొదుపు పథకాలలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే.. తక్కువ మొత్తంలో పొదుపు చేసినా, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవచ్చు. అలాంటి అద్భుతమైన పథకాలలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ఒకటి. ఇందులో రోజుకు కేవలం రూ.300 చొప్పున పొదుపు చేస్తే రూ.15 లక్షల వరకు కార్పస్‌ను సమకూర్చుకోవచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ పథకం ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మ్యుచువల్ ఫండ్ ఎస్‌ఐపీ తరహాలోనే చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగిస్తే గణనీయమైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వమే పెట్టుబడులకు భద్రత కల్పించే పొదుపు పథకం కావడంతో ఇది సురక్షితమైన పెట్టుబడి మార్గంగా మారింది.
కేవలం రూ.100తో ఖాతా ప్రారంభం...
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో చిన్న మొత్తాలతోనే పెట్టుబడిని ప్రారంభించి, ప్రభుత్వ అందించే వడ్డీ రాబడితో భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. దేశంలోని ఏ పోస్టాఫీస్‌లోనైనా కేవలం రూ.100 ప్రారంభ పెట్టుబడితో ఆర్‌డీ ఖాతాను తెరవవచ్చు. ఇందులో గరిష్ఠ పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. అంటే, వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను సింగిల్ అకౌంట్‌గా లేదా జాయింట్ అకౌంట్‌గా తెరవచ్చు. ఈ ప్రభుత్వ పథకం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అవసరమైతే మరో ఐదేళ్ల పాటు ఖాతాను పొడిగించుకోవచ్చు. ఇలా పెట్టుబడిని కొనసాగించడం ద్వారా పథకం నుంచి మరింత రాబడిని పొందే అవకాశం ఉంటుంది.
రూ.15 లక్షలు ఎలా..?
రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా రూ.15 లక్షల భారీ మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే రోజుకు కేవలం రూ.300 పొదుపు చేయాలి. అంటే నెలకు రూ.9వేలు పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ వరకు క్రమం తప్పకుండా డిపాజిట్లు చేస్తే ఐదేళ్లలో మొత్తం పెట్టుబడి రూ.5.4 లక్షలు అవుతుంది. వడ్డీతో కలిపి కార్పస్ రూ.6,42,291కు చేరుతుంది. ఇందులో రూ.1,02,291 కేవలం వడ్డీ రూపంలో వచ్చిన మొత్తమే. అయితే ఐదేళ్లు పూర్తయిన వెంటనే ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయాల్సిన అవసరం లేదు. పెట్టుబడిని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఇలా మొత్తం పదేళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే డిపాజిట్లు రూ.10.80 లక్షలకు చేరుతాయి. ఈ కాలంలో కేవలం వడ్డీ రూపంలోనే రూ.4.57 లక్షలకు పైగా లభిస్తుంది. దీంతో మొత్తం కార్పస్ రూ.15,37,692కు చేరుతుంది.
నిబంధనలు తెలుసుకోండి..
పోస్టాఫీస్ ఆర్‌డీ పథకంలో ఖాతా తెరవాలని భావిస్తున్న వారు ఒక ముఖ్యమైన నిబంధనను తప్పక తెలుసుకోవాలి. పెట్టుబడి కాలంలో నిర్ణీత సమయంలో నెలవారీ వాయిదాను చెల్లించకపోతే నెలకు 1 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తారు. వరుసగా నాలుగు వాయిదాలను చెల్లించడంలో విఫలమైతే రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఆటోమేటిక్‌గా మూసివేస్తారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు
- ●CM Revanth Reddy | కేసీఆర్ ఎర్రవెల్లి మీటింగ్‌పై విచారణ!
- ●BRS MLAs | ఫేక్, ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోండి
- ●TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు సమర్పించండి
- ●Mahesh Kumar Goud | మంత్రులందరి శాఖలు మార్చండి.. హైకమాండ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచన
- ●AYUSH Students Stipend Hike | స్టైపెండ్ డబుల్.. ఆయుష్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ గిఫ్ట్

Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు

CM Revanth Reddy | కేసీఆర్ ఎర్రవెల్లి మీటింగ్‌పై విచారణ!

BRS MLAs | ఫేక్, ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోండి

TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు సమర్పించండి






