Credit Card Bill | ఒక క్రెడిట్ కార్డు బిల్లును ఇంకో కార్డుతో నేరుగా చెల్లించడం ఎందుకు సాధ్యం కాదు..?
Credit Card Bill | బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సులభతరమైన నియమాలను విధించడం, తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ ఉద్యోగులకు క్రెడిట్ కార్డులను అందిస్తుండడంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు బ్యాంకులు కేవలం సిబిల్ స్కోర్ ఆధారంగానే అధిక శాతం వరకు క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి.
Credit Card Bill | బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సులభతరమైన నియమాలను విధించడం, తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ ఉద్యోగులకు క్రెడిట్ కార్డులను అందిస్తుండడంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు బ్యాంకులు కేవలం సిబిల్ స్కోర్ ఆధారంగానే అధిక శాతం వరకు క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డుల వాడకం ఎక్కువైంది. అయితే అత్యవసర ఖర్చుల నిమిత్తం క్రెడిట్ కార్డులను వాడిన తరువాత నెల తిరిగే సరికి బిల్లును చెల్లించడం చాలా మందికి కష్టంగా మారుతోంది. దీంతో ఒక కార్డును ఉపయోగించి మరో కార్డుకు బిల్లు చెల్లిస్తున్నారు. అందుకు గాను థర్డ్ పార్టీ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రస్తుతం దేశంలో ఎక్కువైంది. అయితే ఒక కార్డు బిల్లును ఇంకో కార్డుతో చెల్లించడం కుదరదా.. దీనికి ఎందుకు అనుమతించడం లేదు.. అని చాలా మందికి సందేహం వస్తుంటుంది. కానీ ఇందుకు పలు ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
కార్డు హోల్డర్లపై పెను భారం పడే అవకాశం..
బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్లులను కేవలం ఆమోదిత బ్యాంకింగ్ మార్గాల ద్వారానే చెల్లించేందుకు అనుమతిస్తాయి. ఉదాహరణకు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, సేవింగ్స్ ఖాతా ద్వారా యూపీఐ చెల్లింపులు, నగదు లేదా చెక్ డిపాజిట్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించేందుకు అనుమతి ఉంది. ఈ విధానం పారదర్శకత కోసం రూపొందించబడింది. ప్రత్యక్ష కార్డు-టు-కార్డు చెల్లింపులను అనుమతిస్తే, ఒక క్రెడిట్ లైన్ నుంచి మరొకదానికి అప్పు తీసుకుని చెల్లించడం జరుగుతుంది. దీంతో అప్పులు తగ్గడం కంటే పెరుగుతూ ఉండే సైకిల్‌లా మారుతుంది. దీని వల్ల కార్డు హోల్డర్లపై పెను భారం పడుతుంది. అప్పుడు అసలు బిల్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని నివారించేందుకే కార్డు-టు-కార్డ్ చెల్లింపులను అనుమతించడం లేదు. అయితే క్రెడిట్ కార్డులకు ఉండే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఈ అడ్డంకిని అధిగమించవచ్చు.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం..
ఒక క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని మరో కార్డు ద్వారా చెల్లించేందుకు కార్డుల్లో బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇది క్రెడిట్ కార్డుకు చెందిన యాప్ లేదా సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఒక కార్డులో ఉండే బిల్లు మొత్తాన్ని మరో కార్డుకు బదిలీ చేయవచ్చు. అయితే రెండో కార్డులో క్రెడిట్ లిమిట్ ఆ బిల్లు మొత్తం కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఇక బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేశాక రెండో కార్డులో ఆ మొత్తంపై వడ్డీ వేస్తారు. ప్రాసెసింగ్ చార్జిలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని బ్యాంకులు ఈ విధానంలో ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఇలా క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం పనిచేస్తుంది.
ఇలా చేయొద్దు..
అయితే వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి కార్డులోని నగదును తీసి దాంతో ఇంకో కార్డు బిల్లును చెల్లిస్తుంటారు. ఇలా చేయడం వల్ల నెల నెలా అదే అలవాటు అవుతుంది. ఇది ఒక సైకిల్‌లా కొనసాగుతుంది. దీంట్లో నుంచి బయటపడలేరు. కనుక ఈ విధంగా చెల్లింపులు చేసేముందు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆలోచన చేయాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా కొందరు క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటారు. ఇది మరింత ప్రమాదకరమైన చర్య. దీని వల్ల క్యాష్ తీసుకున్న రోజు నుంచే అధిక మొత్తంలో వడ్డీ విధిస్తారు. ఇతర ఛార్జిలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కనుక ఇతర కార్డుల బిల్లులను చెల్లించేందుకు మరో కార్డు ద్వారా క్యాష్ అడ్వాన్స్‌ను అసలు తీసుకోకూడదు. క్రెడిట్ కార్డు వినియోగదారులు వీలైనంత వరకు ఆదాయానికి, ఖర్చులకు సమన్వయం ఉండేలా చూసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే, వాటి కోసం క్రెడిట్ కార్డులను వాడితే ఆ తరువాత చెల్లింపులు చేయడం కష్టమవుతుంది. కనుక ఆయా విషయాల్లో కార్డు హోల్డర్లు జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Arrest | బెంగళూరుకి పిలిచి కల్పిత విజయగాథలు చెప్పారు.. అందినకాడికి దోచుకుని కటకటాలపాలయ్యారు
జులై 23, 2026

UPI | ఇక యూపీఐలో ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు.. త్వరలో కొత్త ట్యాప్ అండ్ పే ఫీచర్..
జులై 21, 2026

Credit Cards | క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ హిడెన్ ఛార్జీలు తెలియకపోతే నష్టపోతారు..
జులై 18, 2026
తాజావార్తలు
- ●Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్‌లు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
- ●Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ - భర్త, కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా
- ●Talasani Srinivas Yadav | యాదవులు లేనిదే చరిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
- ●Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్‌లు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్

Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ - భర్త, కూతురితో హైదరాబాద్‌లో ల్యాండైన ప్రియాంక చోప్రా

Talasani Srinivas Yadav | యాదవులు లేనిదే చరిత్ర లేదు.. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తలసాని శ్రీనివాస్ యాదవ్

Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి



