Whatsapp | వాట్సాప్ స్టేటస్‌లలో దర్శనమివ్వనున్న యాడ్స్.. ప్రమోటెడ్ చానల్స్ కూడా..
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో ఇకపై స్టేటస్ ప్రకటనలు (Status Ads) ఇవ్వనుంది. అలాగే ప్రమోటెడ్ చానల్స్‌ను కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపింది.
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో ఇకపై స్టేటస్ ప్రకటనలు (Status Ads) ఇవ్వనుంది. అలాగే ప్రమోటెడ్ చానల్స్‌ను కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపింది. మెటా సంస్థకు చెందిన వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌లను అందించడం వల్ల వినియోగదారులు కొత్త వ్యాపారాలు, చానల్స్‌ను సులభంగా కనుగొనేందుకు ఉపయోగపడతాయి. వ్యాపారులు యాప్‌లో తమ విజిబిలిటీని పెంచుకోవచ్చు. నూతన వ్యాపార అవకాశాలను, అమ్మకాలను సృష్టించుకోవచ్చు. వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో ఎంపిక చేసిన పలు చానెల్స్‌ను ఇప్పటికే డైరెక్టరీలో బూస్ట్ చేస్తోంది. దీంతో అవి యూజర్లకు సులభంగా చేరతాయి. అయితే వ్యక్తిగత చాట్స్, కాల్స్, స్టేటస్ అప్‌డేట్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తోనే కొనసాగుతాయని, వాటిని ప్రకటనల కోసం ఉపయోగించబోమని మెటా స్పష్టం చేసింది.
అప్‌డేట్స్ ట్యాబ్‌లో యాడ్స్..
వాట్సాప్ యాప్ లోని అప్‌డేట్స్ అనే ట్యాబ్‌లో ఇకపై యూజర్లకు యాడ్స్ కనిపిస్తాయి. ఇందులో స్టేటస్, చానల్స్ రెండూ ఉంటాయి. కొత్త ప్రకటనలు, ప్రమోటెడ్ చానల్స్ స్పష్టమైన లేబుల్స్‌తో సాధారణ స్టేటస్ పోస్టుల మధ్య దర్శనం ఇస్తాయి. యూజర్లు ఇతర స్టేటస్‌ల మాదిరిగానే స్వైప్ చేసి వీటిని స్కిప్ చేయవచ్చు. కొత్త ఫీచర్‌లపై యూజర్లకు మరింత కంట్రోల్‌ను కూడా ఇచ్చారు. ఒకవేళ ఒకే వ్యాపార ప్రకటన పదే పదే కనిపిస్తే లేదా ఇబ్బందిగా అనిపిస్తే ఆ వ్యాపాన ప్రకటనను బ్లాక్ చేయడం లేదా హైడ్ చేయడం సాధ్యమవుతుందని మెటా తెలిపింది. దీంతో అప్‌డేట్స్ ట్యాబ్‌లో కనిపించే కంటెంట్‌పై యూజర్లకు పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది.
యాడ్స్ రావొద్దంటే సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్..?
యూరోప్‌లోని కొన్ని ప్రాంతాలు సహా కొన్ని చోట్ల స్టేటస్, చానల్స్‌లో ప్రకటనలు లేకుండా వాడుకునేందుకు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను ఇవ్వనున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ ను తీసుకుంటే అప్‌డేట్స్ ట్యాబ్‌లో యాడ్స్ రావు. అయితే దీనిపై మెటా ఇంకా స్పష్టతను ఇవ్వలేదు. ఇక వాట్సాప్ ఇటీవలే గ్రూప్ చాట్ హిస్టరీ అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని వల్ల కొత్తగా గ్రూప్‌లో చేరిన సభ్యులు పాత చాట్‌లను చదివేందుకు వీలు కలుగుతుంది. గ్రూప్ అడ్మిన్ లేదా సభ్యులు 25 నుంచి 100 వరకు పాత మెసేజ్‌లను షేర్ చేసి అనుమతిస్తే కొత్త సభ్యుడు ఆ చాట్ మెసేజ్ లను చదవగలుగుతాడు. ఇక భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా వాట్సాప్‌కు సిమ్ బైండింగ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఫోన్‌లో సిమ్ ఉంటేనే వాట్సాప్ పనిచేయాలి. లేదంటే లాగౌట్ అవుతుంది. అలాగే వాట్సాప్ వెబ్ కూడా ప్రతి 6 గంటలకు ఓసారి ఆటోమేటిగ్గా లాగవుట్ అయ్యేలా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం తెలిపింది. కాగా దీనిపై మెటా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Google | గూగుల్ బంపర్ ఆఫర్.. ఏఐ ప్లాన్ తీసుకుంటే యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



