TVS | సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం
TVS | ప్రముఖ కవి చమన్ సింగ్, సాహిత్య విమర్శకులు, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాలను తెలంగాణ వికాస సమితి (TVS) ప్రకటించింది.
TVS | త్రినేత్ర న్యూస్: ప్రముఖ కవి చమన్ సింగ్, సాహిత్య విమర్శకులు, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాలను తెలంగాణ వికాస సమితి (TVS) ప్రకటించింది. 2024-25కుగాను చమన్ సింగ్ (Chaman Singh), 2025-26కుగాను సంగిశెట్టి శ్రీనివాస్‌కు (Sangishetti Srinivas) ఈ నెల 3న హైదరాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో పురస్కారం అందజేయనున్నారు. అదేవిధంగా విశిష్ట సాహిత్య, సాంస్కృతిక సేవలకు గాను ప్రముఖ రచయిత్రి తిరునగరి దేవకీదేవి, ప్రముఖ గాయకుడు కవ్వంపల్లి స్వామికి ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లావఝల విజయానంద్ తెలిపారు.
అణగారిన వర్గాలపై రచనలకు..
ఏటా మల్లావఝల పేరిట స్మారక పురస్కారాన్ని అణగారిన కులాల పక్షాన రచనలు చేసి, ప్రజల గొంతుకై నిలిచిన ప్రజా కవులకు ఇస్తున్నారు. ఇప్పటివరకు 90 శాతానికి పైగా దళిత, బహుజన కవులకే ఈ అవార్డు అందజేశారు. మల్లావఝల స్మారక పురస్కారాన్ని అందుకున్న వారిలో ప్రజా గొంతుకలై నిలిచిన కవులు గూడ అంజన్న, జయరాజు, గోరేటి వెంకన్న, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, విమలక్క, నిస్సార్, మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, తైదల అంజన్న, వజ్జల శివకుమార్, బెల్లి యాదయ్య, ఆయాచితం శ్రీధర్, మోహన్ ఋషి, మునాస వెంకట్, వనపట్ల సుబ్బయ్య, కోడూరి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Omar Abdullah | 14 రోజుల్లో తేల్చకుంటే కూల్చుడే.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి 25 మంది ఎమ్మెల్యేల అల్టిమేటం
- ●Horoscope | నవంబర్ 2 రాశిఫలాలు.. తోబుట్టువులతో అపార్థాలు రావచ్చు!
- ●KTR Rythu Garjana Adilabad | ఎకరానికి రూ.60 వేలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయ్
- ●INDIA Bloc Delhi Rally | ఓట్ల దొంగలను వదిలిపెట్టం.. జ్ఞానేశ్ జైలుకెళ్లడం ఖాయం
- ●KTR Adilabad Rythu Garjana | ఇది అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చా కాంగ్రెస్
- ●Namasthe Telangana First Batch Reunion | 16 ఏళ్ల తర్వాత నమస్తే తెలంగాణ తొలి బ్యాచ్ ఆత్మీయ కలయిక: అవమానాలు దాటి చరిత్ర సృష్టించాం

Omar Abdullah | 14 రోజుల్లో తేల్చకుంటే కూల్చుడే.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి 25 మంది ఎమ్మెల్యేల అల్టిమేటం

Horoscope | నవంబర్ 2 రాశిఫలాలు.. తోబుట్టువులతో అపార్థాలు రావచ్చు!

KTR Rythu Garjana Adilabad | ఎకరానికి రూ.60 వేలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయ్

INDIA Bloc Delhi Rally | ఓట్ల దొంగలను వదిలిపెట్టం.. జ్ఞానేశ్ జైలుకెళ్లడం ఖాయం




